Yashaswi Jaiswal: చరిత్ర సృష్టించిన యశస్వీ.. ఒకే దెబ్బకు మూడు రికార్డులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yashaswi Jaiswal Creates 3 Records With His Century Against Mumbai Indians: ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ సాధించిన చారిత్రాత్మక విజయం కంటే.. ఈ మ్యాచ్‌లో యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ చేసిన సెంచరీనే టాప్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడిన యశస్వీ.. కేవలం 53 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ని అందుకున్నాడు. ఓవరాల్‌గా 62 బంతుల్లో 15 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 124 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ నేపథ్యంలోనే అతగాడు మూడు రికార్డుల్ని నెలకొల్పాడు.

Also Read
New York: న్యూయార్క్‌లో బైబ్యాక్ కార్యక్రమం.. గిఫ్ట్‌కార్డుల కోసం తుపాకులను వదిలేశారు..
* ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆన్క్యాప్డ్ ప్లేయర్‌గా యశస్వీ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ పాల్ వాల్తాటి పేరిట ఉండేది. 2011 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన అతగాడు.. 120 (నాటౌట్) పరుగులు చేశాడు. ఇప్పుడు 4 పరుగుల తేడాతో వాల్తాటి రికార్డ్‌ని యశస్వీ బద్దలుకొట్టాడు.
* ఇప్పటివరకూ రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా జోస్ బట్లర్ ఉండేవాడు. 2021 సీజన్లో అతడు ఢిల్లీ క్యాపిటల్స్‌పై 124 పరుగులు చేశాడు. ఇప్పుడు యశస్వీ ముంబైపై 124 పరుగులు చేసి, జోస్‌బట్లర్ రికార్డును సమం చేశాడు.
* ఐపీఎల్ చరిత్రలో సెంచరీ నమోదు చేసిన యంగెస్ట్ ప్లేయర్ల జాబితాలో యశస్వీ నాలుగో స్థానంలో నిలిచాడు. అగ్రస్థానంలో మనీష్ పాండే (2009లో ఆర్సీబీ తరఫున 19 ఏళ్ల 253 రోజులు), రెండో స్థానంలో రిషబ్ పంత్( 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 20 ఏళ్ల 218 రోజులు), మూడో స్థానంలో దేవదత్ పడిక్కల్ (2021లో ఆర్సీబీ తరపున 20 ఏళ్ల 289 రోజులు) ఉండగా.. 21 ఏళ్ల 123 రోజుల వయసులో యశస్వీ సెంచరీ సాధించి, నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
Conductor Jhansi: చైతన్య ఆత్మహత్యకు వాళ్ళే కారణం.. సంచలన నిజాలు చెప్పిన కండక్టర్ ఝాన్సీ
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ చేసిన సెంచరీ పుణ్యమా అని, రాజస్థాన్ అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. 19.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసి, విజయం సాధించింది. గ్రీన్ (44), సూర్యకుమార్ (55), టిమ్ డేవిడ్ (45) ఊచకోత కోయడంతో.. ముంబైని విజయం వరించింది. చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సి ఉండగా.. మొదటి మూడు బంతుల్లో టిమ్ డేవిడ్ వరుసగా మూడు సిక్సులు కొట్టి, తన జట్టుని విజయతీరాలకు చేర్చాడు.
తాజావార్తలు
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?