టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ పై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తుంది. అరంగ్రేటం టెస్ట్ లోనే సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ కుర్రాడి ఆటతీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని జైస్వాల్ వమ్ము చేయకుండా తన సత్తా చూపిస్తున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులను సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే.. ఈ యువ ఓపెనర్ విండీస్ బౌలర్‌పై నోరుపారేసుకున్నాడు. పచ్చిబూతు పదంతో అతడిని హిందీలో దూషించాడు. ఈ బూతు పదం స్టంప్ మైక్‌లో రికార్డైంది.
Read Also: Domalguda Fire Accident : దోమల్‌గూడ అగ్ని ప్రమాదం.. 4కు చేరిన మృతుల సంఖ్య
రెండో రోజు ఆట మూడో సెషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్ 103వ ఓవర్‌లో విరాట్ కోహ్లీ, యశస్వి జైశ్వాల్ క్రీజులో ఉన్నారు. విండీస్ పేసర్ కీమర్ రోచ్ తన 14వ ఓవర్‌ని వేస్తున్నాడు. సింగిల్ తీసిన అనంతరం జైశ్వాల్ సహనం కోల్పోయి.. నా దారికి అడ్డురాకు.. అంటూ హిందీలో ఓ పచ్చి బూతు పదాన్ని ఉపయోగించాడు. జైశ్వాల్ అన్నది కోహ్లీ వెంటనే ఏం జరిగిందని అతడిని అడిగాడు. రన్ తీస్తుంటే.. అతడు పదే పదే అడ్డువస్తున్నాడు అని కోహ్లీకి జైశ్వాల్ చెప్పుకొచ్చాడు. ఎవరు అని రోచ్‌ను ఉద్దేశిస్తూ కోహ్లీ అడుగగా అవును అంటూ జైశ్వాల్ ఆన్సర్ ఇచ్చాడు.
Read Also: Sukumar: ఆ రంగంలో ఇంట్రెస్ట్.. కూతుర్ని అమెరికా తీసుకెళ్తున్న సుకుమార్
అయితే, జైస్వాల్-కోహ్లీ మాటలు మొత్తం స్టంప్ మైక్‌లలో రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 162 పరుగుల ఆధిక్యంలో ఉంది. యశస్వి జైశ్వాల్ (350 బంతుల్లో 14 ఫోర్లతో 143 పరుగులు నాటౌట్), విరాట్ కోహ్లి(96 బంతుల్లో 1 ఫోర్, 36 పరుగులు నాటౌట్)లు క్రీజులో ఉన్నారు.
yashasvi jaiswal scolding kemar roach in hindi #YashasviJaiswal #ViratKohli𓃵 #INDvsWI pic.twitter.com/2dhX4VrliH
— Sayyad Nag Pasha (@nag_pasha) July 14, 2023
