WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Indians WPL 2027 Full Squad: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2027 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ తమ స్క్వాడ్‌ను బలోపేతం చేసుకుంది. కొచ్చిలో బుధవారం జరిగిన వేలంలో పలువురు భారత యువ ఆటగాళ్లను ముంబై సొంతం చేసుకుంది. బ్యాటర్ దిశా కసత్, వికెట్‌కీపర్ బ్యాటర్ లతికా ఇనామ్దార్, స్పిన్నర్ భారతి రావల్లను ఒక్కొక్కరిని రూ.10 లక్షల బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది. వీరితో పాటు సానికా చాల్కే, శ్వేతా సెహ్రావత్, ఆల్‌రౌండర్ అక్షితా భగత్‌లను కూడా జట్టులోకి తీసుకుంది. ఇప్పటికే సీనియర్ విదేశీ ఆటగాళ్లు, భారత స్టార్ క్రికెటర్లతో బలంగా ఉన్న ముంబై.. కొత్త ఆటగాళ్ల చేరికతో మరింత పటిష్టంగా మారింది.
రూ.10 లక్షలకే దిశా కసత్, లతికా ఇనామ్దార్:
విదర్భ తరఫున దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న దిశా కసత్ గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ప్రాతినిధ్యం వహించింది. ఇటీవల సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఓపెనర్‌గా బరిలోకి దిగి 52 బంతుల్లో అజేయంగా 66 పరుగులు సాధించింది. ఆమె బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ ఆకట్టుకుంది. మరోవైపు వికెట్‌కీపర్ బ్యాటర్ లతికా ఇనామ్దార్ కూడా అదే మ్యాచ్‌లో ధాటిగా పరుగులు చేసింది. విదర్భ ఛేదనలో కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన ఆమె ఎనిమిది బంతుల్లోనే 17 పరుగులు చేసింది. ఇద్దరినీ రూ.10 లక్షల చొప్పున ముంబై కొనుగోలు చేసింది. కమలిని జట్టులో లేకపోవడంతో దిశా లేదా లతికాకు వచ్చే సీజన్లో ఆడే అవకాశం లభించవచ్చు.
Also Read
- Musheer Khan Record: 21వ శతాబ్దంలోనే మొదటిసారి.. ముషీర్ ఖాన్ అరుదైన ఘనత!
- Bhuvneshwar Kumar: మూడు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్.. భువనేశ్వర్ కుమార్‌పై మళ్లీ వేటు..?
- Abhishek-Vaibhav: నా ఇన్నింగ్స్ క్రెడిట్ వైభవ్‌కే.. అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Arshdeep Singh History: ప్రపంచ రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. మరో వికెట్ తీస్తే తోపే!
శ్వేతా సెహ్రావత్‌కు రూ.20 లక్షలు:
ఢిల్లీకి చెందిన బ్యాటర్ శ్వేతా సెహ్రావత్‌ను ముంబై ఇండియన్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఆమె 2023 అండర్-19 ప్రపంచకప్ విజేత భారత జట్టులో సభ్యురాలు. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటీ తర్వాత ముంబై ఆమెను దక్కించుకుంది. శ్వేతా చేరికతో బ్యాటింగ్ విభాగంమరింత పటిష్టం కానుంది. దిశా కసత్, లతికా ఇనామ్దార్లతో పాటు శ్వేతా సెహ్రావత్ వంటి యువ బ్యాటర్ల రాకతో ముంబై జట్టు బలంగా మారింది. మరోవైపు ఢిల్లీకి చెందిన ఎడమచేతి వాటం స్పిన్నర్ భారతి రావల్‌ను కూడా రూ.10 లక్షలకు సొంతం చేసుకుంది.
యువ ఆల్‌రౌండర్ అక్షితా భగత్‌కు చోటు:
ముంబై ఇండియన్స్ వేలంలో యువ ఆల్‌రౌండర్ అక్షితా భగత్‌ను రూ.10 లక్షలకు తీసుకుంది. 19 ఏళ్ల అక్షితా డబ్ల్యూపీఎల్ స్పీడ్ క్వీన్ అండర్-23 పోటీలో విజేతగా నిలిచింది. ఇటీవల భారత జట్టు తరఫున కూడా ఆడింది. యువ ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు భవిష్యత్తుకు ఉపయోగపడే ఆటగాళ్లను సిద్ధం చేసుకోవడంపై ముంబై దృష్టి సారించింది. వేలంలో ముంబై ప్రధానంగా భారత యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించడంపై దృష్టి పెట్టింది. బ్యాటింగ్, వికెట్‌కీపింగ్, స్పిన్ బౌలింగ్, ఆల్‌రౌండ్ విభాగాల్లో ప్రత్యామ్నాయాలను పెంచుకునేలా ఆటగాళ్లను ఎంపిక చేసింది. సీనియర్ అంతర్జాతీయ క్రికెటర్లకు తోడు కొత్త ఆటగాళ్లన తీసుకోవడంతో జట్టు సమతూకంగా మారింది.
ముంబై ఇండియన్స్ పూర్తి స్క్వాడ్:
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
దిశా కసత్ — రూ.10 లక్షలు
లతికా ఇనామ్దార్ — రూ.10 లక్షలు
భారతి రావల్ — రూ.10 లక్షలు
సానికా చాల్కే — రూ.10 లక్షలు
శ్వేతా సెహ్రావత్ — రూ.20 లక్షలు
అక్షితా భగత్ — రూ.10 లక్షలు
మిగతా జట్టు సభ్యులు:
హర్మన్‌ప్రీత్ కౌర్
అమన్‌జోత్ కౌర్
అమేలియా కెర్
హేలీ మాథ్యూస్
నాట్ సీవర్-బ్రంట్
నికోలా క్యారీ
రహీలా ఫిర్దౌస్
సజీవన్ సజనా
సంస్కృతి గుప్తా
షబ్నిమ్ ఇస్మాయిల్
వైష్ణవి శర్మ
తాజావార్తలు
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
2027 Kawasaki Z900: Kawasaki Z900 బైక్ భారత్ లో లాంచ్.. 5-ఇంచ్ TFT డిస్ప్లే, 948cc ఇంజిన్, ధర, ఫీచర్లు ఇవే
-
Cyclone Arnab: కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులు, బాధితులతో ముఖాముఖి!
-
How to Make Besan at Home: ఇక మార్కెట్లో కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోనే స్వచ్ఛమైన శనగపిండి తయారు చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..
-
9,020 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2.3K 165Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ iQOO Pad Pro లాంచ్..!
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?