వన్డే ప్రపంచకప్‌లో నజ్ముల్ హుస్సేన్ శాంటో అద్భుత డైవింగ్ క్యాచ్ పట్టాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాడు లాంగ్ ఆఫ్‌లో ఈ క్యాచ్ తీసుకున్నాడు. ధర్మశాలలో బంగ్లాదేశ్-ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే ప్రపంచకప్ 7వ మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఈ క్యాచ్ పట్టగా.. ఐసీసీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి అద్భుతమైన క్యాచ్ వీడియో షేర్ చేశారు.
Read Also: Vijayawada: ఇంద్రకీలాద్రిలో దసరా ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులు సమీక్ష
బంగ్లాదేశ్ స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ వేసిన బౌలింగ్ లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ సామ్ కుర్రాన్ బంతిని లాంగ్ ఆఫ్ వైపు కొట్టాడు. అయితే బౌండరీ దగ్గర ఉన్న షాంటో.. లాంగ్ డైవ్ చేసి క్యాచ్ పట్టాడు. అంతేకాకుండా.. క్యాచ్ పట్టుకున్న తర్వాత కూడా అతను అలానే జారుకుంటూ వెళ్లాడు. అయితే ఐసీసీ షేర్ చేసిన వీడియోలో క్యాచ్ ను స్లో మోషన్‌లో కూడా చూపించారు. అందులో క్యాచ్ కోసం శాంటో ఎంతసేపు డైవ్ చేసాడో చూపించారు.
Read Also: Minister Adimulapu: తప్పు చేసిన వారు ఎంతటి వారైనా న్యాయస్థానాల ముందు నిలబడాల్సిందే
అంతకుముందు.. బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. డేవిడ్ మలన్ జట్టు తరపున 140 (107) పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన.. జో రూట్ 8 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 82 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా వచ్చిన జానీ బెయిర్‌స్టో 8 ఫోర్ల సాయంతో 52 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు.