NTV Telugu Site icon

World Cup final: ఫైనల్ మ్యాచ్‌లో కలకలం.. “ఫ్రీ పాలస్తీనా” టీషర్ట్ ధరించి దూసుకొచ్చిన వ్యక్తి..

World Cup

World Cup

World Cup final: ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచులో కలకలం రేగింది. ఫ్రీ పాలస్తీనా అంటూ టీషర్ట్, పాలస్తీనా జెండా రంగులు కలిగిన మాస్క్ ధరించిన ఓ వ్యక్తి గ్రౌండ్ లోకి దూసుకొచ్చాడు. పిచ్ వద్దకు వచ్చి బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీని కౌగిలించుకోవడానికి ప్రయత్నించారు.

ఎర్రటి షార్ట్ ధరించిన వ్యక్తి ముందు భాగంలో ‘‘ పాలస్తీనాపై బాంబింగ్ ఆపండి’’ అని, వెనక ‘ఫ్రీ పాలస్తీనా’ అనే కామెంట్స్ ఉన్న తెల్లటి టీషర్టు ధరించాడు. భద్రతా ఉల్లంఘనపై ఆ వ్యక్తిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read Also: IND vs AUS: గత 10 ఓవర్ల నుంచి లేని బౌండరీ.. ఆచితూచి ఆడుతున్న కోహ్లీ, కేఎల్ రాహుల్

ఇలా ఓ అన్ నోన్ వ్యక్తి మైదానంలోకి దూసుకు రావడం వల్ల మ్యాచ్ కొద్దిసేపు నిలిచిపోయింది. భద్రతా అధికారులు చొరబాటుదారుడిని పట్టుకున్నారు, ఆ తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. ఫామ్ లో ఉన్న శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ ఔట్ కావడంతో ప్రస్తుతం విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇటీవల జరిగిన మ్యాచులో ఓ వ్యక్తి ఇజ్రాయిల్-భారత్ స్నేహాన్ని తెలిపేలా జెండాను ప్రదర్శించారు. తాజాగా ఈ రోజు జరుగున్న మ్యాచులో ఏకంగా ఓ వ్యక్తి పాలస్తీనాకు మద్దుతుగా టీషర్టు, మాస్కు ధరించి స్టేడియంలోకి రావడం సంచలనంగా మారింది.