NTV Telugu Site icon

ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల.. భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఎప్పుడంటే?

Icc Odi Wc

Icc Odi Wc

BCCI released schedule of ODI World Cup 2023: ఈ ఏడాది చివరలో మరో క్రికెట్‌ పండగ ఉన్న విషయం తెలిసిందే. భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ 2023 జరగనుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించి ముసాయిదా షెడ్యూల్‌ (డ్రాప్ట్‌ షెడ్యూల్‌)ను బీసీసీఐ నేడు విడుదల చేసింది. ప్రపంచకప్ ముసాయిదా షెడ్యూల్‌ను ఐసీసీకి బీసీసీఐ పంపింది . ప్రపంచకప్ ఆడే మిగతా దేశాలకు కూడా ఈ షెడ్యూల్‌ను పంపిస్తారు. ఆ దేశాల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్న అనంతరం తుది షెడ్యూల్‌ను రూపొందిస్తారు. ఆ షెడ్యూల్‌ను ఐసీసీ అధికారికంగా ప్రకటిస్తుంది.

బీసీసీఐ ముసాయిదా షెడ్యూల్‌ ప్రకారం 2023 అక్టోబర్‌ 5న వన్డే ప్రపంచకప్‌ ఆరంబం కానుంది. మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో ఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్, రన్నరప్‌ న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. అహ్మదాబాద్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. భారత్‌ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 15న భారత్ తలపడనుంది. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌ వేదికగా ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది.

భారత్‌ జట్టు వన్డే ప్రపంచకప్‌ 2023లోని తమ లీగ్‌ మ్యాచ్‌లను మొత్తం 9 నగరాల్లో ఆడనుంది. మరోవైపు పాకిస్థాన్‌ మాత్రం 5 నగరాల్లో తన లీగ్‌ మ్యాచ్‌లను ఆడనుంది. మొత్తం 10 జట్లు పాల్గొనే వన్డే ప్రపంచకప్‌ 2023 టోర్నీలో ఇప్పటికే 8 జట్లు అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్‌ ద్వారా మరో రెండు జట్లు అర్హత సాదిస్తాయి. ఫైనల్ మ్యాచ్ కోసం వేదికగా ఖరారు అయినా.. నవంబర్‌ 15, 16 తేదీల్లో జరిగే సెమీ ఫైనల్స్‌ వేదికలు మాత్రం ఖరారు కాలేదు.

Also Read: Viral Video: జింకేంటి ఇలా తినేస్తుంది.. చూశారంటే మీరు షాక్..!

భారత్ షెడ్యూల్:
అక్టోబర్‌ 8 : భారత్ vs ఆస్ట్రేలియాతో (చెన్నై)
అక్టోబర్‌ 11 : భారత్ vs అఫ్గానిస్థాన్‌ (ఢిల్లీ)
అక్టోబర్‌ 15 : భారత్ vs పాకిస్థాన్‌ (అహ్మదాబాద్‌)
అక్టోబర్‌ 19 : భారత్ vs బంగ్లాదేశ్‌ (పుణె)
అక్టోబర్‌ 22 : భారత్ vs న్యూజిలాండ్‌ (ధర్మశాల)
అక్టోబర్‌ 29 : భారత్ vs ఇంగ్లండ్ (లక్నో)
నవంబర్‌ 2 : భారత్ vs క్వాలిఫయర్‌ టీం (ముంబై)
నవంబర్‌ 5 : భారత్ vs దక్షిణాఫ్రికా (కోల్‌కతా)
నవంబర్‌ 11 : భారత్ vs క్వాలిఫయర్‌ టీం (బెంగళూరు)

Also Read: Team India: టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తొలగిస్తే.. నెక్ట్స్ సారథి ఎవరు..?