Site icon NTV Telugu

Virat Kohli: నేటి మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆడేది అనుమానమే..?

Kohli

Kohli

Virat Kohli: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అనగానే క్రికెట్ అభిమానుల్లతో ఎంతో ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ దాయాది పోరు కోసం ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం దుబాయ్ లో జరిగే ఈ మ్యాచ్ లో ఇద్దరు ప్లేయర్స్ ఆడతారా లేదా అనేది అనుమానంగా కలుగుతుంది. అందులో ఒకరు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అయితే రెండో వారు వికెట్ కీపర్ రిషభ్ పంత్.. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు ఆడకపోయినా కూడా జట్టుకు బిగ్ షాక్ అని చెప్పాలి.

Read Also: Daaku Maharaaj : నెట్ ఫ్లిక్స్ లో డాకుమహారాజ్ సంచనలం.. ఏకంగా పాకిస్థాన్ లో

అయితే, కింగ్ కోహ్లీ తుది జట్టులో కీ ప్లేయర్.. అతను ఫాంలో ఉన్న లేకపోయినా జట్టులో ఉంటే అదొక బలం అని చెప్పాలి. ప్రత్యర్థి ఎవరైనా కాస్త జాగ్రత్తగా ఉంటారు. ఈ రోజు పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో విరాట్ ఆడేది అనుమానంగా ఉంది. ఎందుకంటే ప్రాక్టీస్ చేసే సమయంలో కోహ్లీ కాలికి దెబ్బ తగిలినట్టు కనిపించింది. అతను ఐస్ ప్యాక్ పెట్టుకుని ఎక్కువ సేపు కూర్చోవడంతో.. ఈ అనుమానాలన్నీ స్టార్ట్ అయ్యాయి. కానీ, బీసీసీఐ దీని గురించి మాత్రం ఎలాంటి అనౌన్స్ చేయలేదు.. కాబట్టి తుది ఆడతాడనే అందరూ అనుకుంటున్నారు. ఏది ఏమైనా మ్యాచ్ ముందు వరకు కోహ్లీ ఆడేది అనుమానంగా ఉంది.

Read Also: Pak Bowling Coach Aqib Javed: టీమిండియా స్పిన్ చూసి మేము ఆందోళన చెందడం లేదు..

ఇక, వికెట్ కీపర్ రిషభ్ పంత్ విషయానికి వస్తే.. అతను హై ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నాడని సమాచారం. ఈ విషయాన్ని శుభ్ మన్ గిల్ తెలిపాడు. వైరల్ ఫీవర్ తో పంత్ ప్రాక్టీస్ సెషన్‌కు రాలేదని తెలిపారు. బీసీసీఐ అతనికి చికిత్స అందిస్తూ జాగ్రత్తగా చూసుకుంటోంది అని చెప్పాడు. కానీ, మ్యాచ్ సమయానికి పంత్ కోలుకునే అవకాశం ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా, పంత్ జట్టులో లేకపోయినా పెద్ద ఇబ్బంది ఏమీలేదు.. కానీ, విరాట్ కోహ్లీ మాత్రం ఆడకపోతే.. టీమిండియాపై పాకిస్థా్న్ జట్టు రెచ్చిపోయే ప్రమాదం ఉందని క్రికెట్ నిపుణులు అంటున్నారు.

Exit mobile version