Ravi Shastri : ధోనీపై రవిశాస్త్రి సీరియస్.. ఆ ఓటమిని తట్టుకోలేక!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మిస్టర్ కూల్, మాజీ కెప్టెన్ ధోనీపై సీరియస్ అయ్యాడట. ఇప్పుడు ఈ వార్త నెట్టింట ఫుల్ వైరల్‌గా మారింది. ఈ విషయాన్ని టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తన తాజా బుక్ ‘కోచింగ్ బియాండ్: మై డేస్ విత్ ద ఇండియన్ క్రికెట్ టీమ్’లో రాశాడు. ఇందులో ఇప్పటి వరకూ క్రికెట్ ఫ్యాన్స్‌కు తెలియని ఎన్నో ఆశ్చర్యకర విషయాలు కూడా ఉన్నాయి. ధోనీపై అప్పటి కోచ్ రవిశాస్త్రి సీరియస్ అవడం కూడా ఇందులో ఒకటి. 2018లో ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా ఈ ఘటన జరిగిందట. తొలి వన్డేలో 8 వికెట్లతో ఇండియా గెలిచినా.. తర్వాతి మ్యాచ్‌లో 86 రన్స్ తేడాతో పరాజయం పాలైంది. అయితే ఈ పోరులో మహీ కనీసం ఫైట్ చేయకుండానే చేతులెత్తేసిన తీరు కోచ్ రవిశాస్త్రికి నచ్చలేదని శ్రీధర్ తెలిపాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ, రైనా క్రీజులో ఉన్నంత వరకూ ఆశలు ఉన్నా.. తర్వాత వెంటవెంటనే ఈ ఇద్దరితోపాటు హార్దిక్ కూడా ఔటవడం ఇండియా ఓటమికి కారణమైంది.
Tollywood: వైజాగ్ లో తెలుగు నటుడి ఆత్మహత్య!
Also Read
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
“టీమిండియా విజయానికి 66 బంతుల్లో 133 రన్స్ అవసరం. టెయిలెండర్లతో కలిసి ధోనీ క్రీజులో ఉన్నాడు. అయితే అతడు మాత్రం విజయం కోసం ఏమాత్రం ప్రయత్నించకుండా నెమ్మదిగా ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లోనే ధోనీ వన్డేల్లో 10 వేల రన్స్ కూడా పూర్తిచేసుకున్నాడు. అయితే చివరికి అతడు 59 బంతుల్లో కేవలం 37 రన్స్ చేసి 47వ ఓవర్లో ఔటయ్యాడు. ఇదే రవిశాస్త్రికి కోపం తెప్పించింది. 86 రన్స్‌తో ఓడిపోయినందుకు కాదు కానీ.. కనీసం పోరాడకుండానే చేతులెత్తేయడం అతనికి నచ్చలేదు. అందుకే మూడో వన్డేకు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో మీటింగ్ పెట్టాడు. అప్పుడు నేరుగా ధోనీ కళ్లలోకి చూస్తూ రవి ఇలా చెప్పాడు. ‘మీరు ఎవరైనా సరే.. గెలవడానికి ప్రయత్నించకుండా మరో మ్యాచ్ ఓడిపోయే పరిస్థితి మళ్లీ రాకూడదు. నా కోచింగ్‌లో ఇలాంటిది జరగకూడదు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే మాత్రం అతనికి అదే చివరి మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ ఓడిపోవడంలో సిగ్గు పడాల్సిందేమీ లేదు. కానీ ఇలా మాత్రం ఓడకూడదు” అని రవిశాస్త్రి అన్నట్లు శ్రీధర్ తన బుక్‌లో రాసుకొచ్చాడు.
తాజావార్తలు
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!