Site icon NTV Telugu

WFI: రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్

Wfi

Wfi

రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ ఎన్నికలు జులై 4న జరుగుతాయని ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ సోమవారం వెల్లడించింది. జమ్మూ అండ్‌ కశ్మీర్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మహేశ్‌ మిట్టల్‌ కుమార్‌ను రిటర్నింగ్‌ అధికారిగా నియమించడంతో ఎన్నికల ప్రక్రియ మొదలైనట్లు ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ తెలిపింది.

Also Read : Lifestyle : మగవాళ్ళు చేసే ఈ పనులు ఆడవారికి అస్సలు నచ్చవట..

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఈ ఏడాది మార్చిలో పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. WFI ముందుగా మే 7న ఎన్నికల తేదీని ప్రకటించింది. అయితే వివాదాల కారణంగా భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఆ తేదీన ఎన్నిక నిర్వహించేందుకు నిరాకరించింది. ఎన్నికలను నిర్వహించడానికి ఇద్దరు సభ్యుల తాత్కాలిక కమిటీని నియమించి, నూతనంగా ఎన్నికల ప్రక్రియను స్టార్ట్ చేసింది.

Also Read : Bihar: బీహార్ బాలికను కిడ్నాప్ చేసి, బలవంతంగా విసిరేశాడు.. చివరికి..

కాగా, గత కొన్ని నెలలుగా భారత రెజ్లర్లు డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై లైంగిక ఆరోపణలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు. ఈ విషయంలో కేంద్రంతో పలు చర్చల అనంతరం రెజ్లర్లు ఓ మెట్టు కిందకు దిగారు. జూన్‌ 15వ తేదీ వరకు ఆందోళనలను చేపట్టబోమని, అప్పటివరకు తమ నిరసన ప్రదర్శనలను వాయిదా వేస్తున్నట్లు రెజ్లర్లు ప్రకటించారు. కేంద్రం నుంచి రాతపూర్వక హామీ లభించినందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. ఈ విషయంలో కేంద్రం ముందు రెజ్లర్లు ఐదు డిమాండ్లు ఉంచారు.

Also Read : Laptop Charging: చార్జింగ్ త్వరగా అయిపోకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ పాటించాలి..!!

1. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవిని మహిళకు ఇవ్వాలి.. 2. కొత్తగా ఏర్పాటు చేసిన సమాఖ్యలో బ్రిజ్ భూషణ్, ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఉండొద్దు. 3. రెజ్లింగ్ పాలక మండలికి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలి. 4. పార్లమెంట్ ఓపెనింగ్ రోజు జరిగిన ఉద్రిక్తతలలో రెజ్లర్లపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలి. 5. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌ను వెంటనే అరెస్టు చేయాలి అనే డిమాండ్లను కేంద్రం ముందు రెజ్లర్లు ఉంచారు.

Exit mobile version