NTV Telugu Site icon

Virat Kohli Pub: విరాట్ కోహ్లీ పబ్‌కు నోటీసులు.. స్పందించకపోతే చర్చలు తీసుకుంటాం!

Virat

Virat

Virat Kohli Pub: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చెందిన పబ్‌కు అధికారులు నోటీసులు ఇచ్చారు. బెంగళూరులోని ఎమ్‌జీ రోడ్డులో గల కోహ్లీకి చెందిన వన్ 8 కమ్యూన్ పబ్ నిర్వాహకులు ఫైర్‌ సేఫ్టీ ఉల్లంఘనకు పాల్పడినట్లు బెంగళూరు బృహత్‌ మహానగర పాలిక ఆఫీసర్లు గుర్తించడంతో నోటీసులు జారీ చేశారు. అయితే, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సమీపంలోని ఎమ్‌జీ రోడ్డులో ఉన్న రత్నం కాంప్లెక్స్‌లోని 6వ అంతస్తులో ఈ రెస్టారెంట్ ను నిర్వహిస్తున్నారు.

Read Also: Drone Attacks in Russia: అమెరికాలో 9/11 దాడి వలె.. భవనాలపై డ్రోన్ దాడులు

అయితే, ఈ పబ్ కు అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ సహా ఎలాంటి పర్మిషన్లు లేకుండానే దీన్ని నిర్వహిస్తున్నారని సామాజిక కార్యకర్త వెంటకేష్‌ బెంగళూరు సివిల్‌ బాడీకి కంప్లైంట్ చేశారు. కాగా, ఫైర్‌ సేఫ్టీ చర్యలు లేకపోవడంతో ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఎంక్వైరీ చేసిన బీబీఎంసీ అధికారులు.. ఆ ఫిర్యాదు నిజమేనని తెలిపారు. ఈ మేరకు నవంబర్‌ 29వ తేదీన విరాకట్ కోహ్లీకి చెందిన ఆ పబ్‌కు నోటీసులు అందజేశారు.

Read Also: Robin Uthappa: పీఎఫ్‌ చెల్లింపుల వివాదంలో మాజీ క్రికెటర్‌.. ఉతప్పకు అరెస్ట్‌ వారెంట్‌

కాగా, వన్ 8 కమ్యూన్ పబ్‌ యాజమాన్యం బీబీఎంసీ నోటీసులకు స్పందించకపోగా దిద్దుబాటు చర్యలు చేపట్టడంలో ఫెయిల్ అయ్యారు. దీంతో అధికారులు కోహ్లీ పబ్‌పై మరోసారి కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు తాజాగా నోటీసులు అందజేశారు. వారం రోజుల్లోగా ఫైర్‌ సేఫ్టీకి సంబంధించిన ఎన్‌వోసీని సమర్పించాలి లేకపోతే.. 7 రోజుల్లో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. అయితే, ఈ ఏడాది జులైలో విరాట్ కోహ్లీ వన్‌ 8 కమ్యూన్‌ పబ్‌పై కేసు నమోదు అయింది. పబ్‌ నిర్ణీత సమయానికి మించి నడుపుతున్నారని గుర్తించిన పోలీసులు కేసు ఫైల్ చేశారు.

Show comments