Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీలో ఆదివారం రాత్రికి హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ప్రతిష్టాత్మక మ్యాచ్ ఆడబోతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది కెరీర్‌లో 100వ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్. దీంతో అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లలోనూ వంద మ్యాచ్‌లు ఆడిన ఏకైక టీమిండియా ప్లేయర్‌గా కోహ్లీ గుర్తింపు సాధిస్తాడు. ఇప్పటివరకు 99 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 3,308 పరుగులు చేశాడు. ఇందులో 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అసలే పాకిస్థాన్‌తో మ్యాచ్ కావడంతో కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఎలా ఆడతాడోనని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
Read Also: Andrea Jeremiah: నగ్నంగా నటించిన ‘పుష్ప’ సింగర్.. అన్ని కోట్లు తీసుకుందా..?
మరోవైపు కేఎల్ రాహుల్‌కు కూడా ఈ మ్యాచ్ ప్రత్యేకమే. ఎందుకంటే ఈ ఏడాది అతడు ఆడుతున్న తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇదే. ఐపీఎల్ తర్వాత గాయపడిన కేఎల్ రాహుల్ మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఐర్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక పర్యటనలకు ఎంపిక కాలేదు. ప్రస్తుతం ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తుండటంతో కేఎల్ రాహుల్ ఈ ఏడాది తొలి టీ20 ఆడబోతున్నాడు. అది కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టుపై కావడం మరో విశేషం. జింబాబ్వే పర్యటనలో రాణించని కేఎల్ రాహుల్ ఆసియా కప్‌లో రాణించకపోతే టీ20 ప్రపంచకప్‌కు జట్టులో చోటు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
https://www.youtube.com/watch?v=bIj23WjWYsM&ab_channel=NTVSports
