NTV Telugu Site icon

IND vs SL: అందరి కళ్లు కోహ్లీపైనే.. దిగ్గజాల సరసన చేరేనా..?

మొహాలీ వేదికగా భారత్‌-శ్రీలంక మధ్య టెస్టు మ్యాచ్‌ జరగనుంది. అయితే, వందో టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న విరాట్‌ కోహ్లీపైనే అందరీ కళ్లు ఉన్నాయి. మొహాలీ వేదికగా జరిగే టెస్టులో… సెంచరీ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాదు… మరో 38 పరుగులు చేస్తే… 8వేల పరుగులు చేసిన ఆరో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నారు. టీమిండియా తరపున సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్ ద్రవిడ్, సునీల్‌ గవాస్కర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరంద్ర సెహ్వాగ్‌… దేశం తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించారు. తొలి ఇన్నింగ్స్‌లోనే విరాట్‌ 38 పరుగులు చేస్తే… తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 8వేల పరుగుల ఘనతను అందుకొన్న ఐదో భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కనున్నాడు.

Read Also: IND vs SL: కోహ్లీ, రోహిత్‌ శర్మ అరుదైన పీట్‌..!

సుదీర్ఘ ఫార్మాట్‌లో విరాట్‌ కోహ్లీ సెంచరీ చేసి… దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఇటీవలి కాలంలో కోహ్లీ అర్ధ శతకాలు సాధిస్తున్నా వాటిని శతకాలుగా మలచడానికి ఇబ్బందులు పడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ కొట్టి….దిగ్గజాల సరసన చేరాలని అభిమానులు ఆశిస్తున్నారు. భారత్‌-శ్రీలంక జట్ల మధ్య రేపే ఫస్ట్‌ టెస్ట్‌ ప్రారంభం కానుండగా.. విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్‌ రోహిత్‌ శర్మలకు ఈ మ్యాచ్‌ మైలురాయి కానుంది. సుదీర్ఘ ఫార్మాట్‌లో తొలిసారి పూర్తిస్థాయి కెప్టెన్‌ బాధ్యతలు చేపడుతున్న రోహిత్‌ శర్మ.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు.