బిగ్ బ్రేకింగ్: టెస్ట్ కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం నాడు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఏడేళ్లుగా తాను టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించానని.. ప్రస్తుతం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఏడేళ్లుగా ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని, తనకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపాడు.
కెప్టెన్‌గా జట్టుకోసం సర్వశక్తులు ధారపోశానని… ఎంతో నిజాయతీగా వ్యవహరించానని కోహ్లీ తెలిపాడు. ప్రతి దానికి ఏదో ఒక దశలో ముగింపు అనేది ఉంటుందని… తన విషయంలోనూ అంతేనన్నాడు. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తన ప్రస్థానం ఇంతటితో ముగిసిందని అనుకుంటున్నట్లు కోహ్లీ తెలిపాడు. తన ప్రస్థానంలో ఒక్కసారి కూడా ప్రయత్నలోపం కానీ, నమ్మకం కోల్పోవడం కానీ జరగలేదన్నాడు. జట్టు కోసం ప్రతి సందర్భంలో 120 శాతం కష్టపడ్డానని… తాను ఏదైనా చేయలేకపోయుంటే, అది చేయదగ్గ పని కాదనే అర్థమన్నాడు. టెస్టు కెప్టెన్‌గా తాను వ్యవహరించిన విధానంపై తనకు ఎంతో స్పష్టత ఉందన్నాడు.
Also Read
- WTC Final: WTC ఫైనల్ రేసులో భారత్.. ఇదొక్కటి చేస్తే కప్ ఇండియాదే..
- Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
- New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- Ravindra Jadeja: జడేజాలో మైండ్ బ్లోయింగ్ చేంజ్.. సీక్రెట్ బయటపెట్టిన పుజారా..
అటు తనలో కెప్టెన్‌ను గుర్తించి.. తనపై నమ్మకం ఉంచిన ధోనీకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడు. రవిశాస్త్రితో పాటు టీమ్ మొత్తానికి థాంక్స్ చెప్పాడు. కాగా 2014 నుంచి 2022 వరకు 68 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ జట్టుకు 40 విజయాలు అందించగా… 17 మ్యాచ్‌లలో జట్టు ఓటమి పాలయ్యింది. 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. 58.82 గెలుపు శాతంతో భారత టెస్టు క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నీరాజనాలు అందుకున్నాడు.
కాగా భారత టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ చేసిన ప్రకటనపై బీసీసీఐ స్పందించింది. కోహ్లీకి ధన్యవాదాలు తెలియజేసింది. అద్భుతమైన నాయకత్వ లక్షణాలతో భారత జట్టును ఎన్నో శిఖరాలకు తీసుకెళ్లావని… 68 టెస్టుల్లో 40 విజయాలతో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచావని బీసీసీఐ కొనియాడింది.
— Virat Kohli (@imVkohli) January 15, 2022
తాజావార్తలు
-
Anchor Charmila : స్టార్ ప్రొడ్యూసర్స్ హీరోయిన్ ఆఫర్ ఇచ్చినా వద్దన్న యాంకర్ చర్మిల.. అసలు కారణం ఇదే!
-
Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
-
Charmila Nalluri Background : ట్రెండింగ్ యాంకర్ చర్మిల బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
-
WTC Final: WTC ఫైనల్ రేసులో భారత్.. ఇదొక్కటి చేస్తే కప్ ఇండియాదే..
-
Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!