NTV Telugu Site icon

ముంబై టెస్ట్ లో వికెట్ కీపర్ పై కోహ్లీ క్లారిటీ…

రేపటి నుండి భారత్ – న్యూజిలాం జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ముంబై వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ గా ఆంధ్ర కుర్రాడు శ్రీకర్ భరత్ తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతాడు అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే… కివీస్ తో జరిగిన మొదటి టెస్ట్ లో భారత సీనియర్ వికెట్ కీపర్ సాహా మొదటి రోజు బ్యాటింగ్ ముగిసిన తర్వాత మెడ కండరాలు పట్టేయడంతో కీపింగ్ చేయడానికి రాలేదు. అతని స్థానంలో భరత్ వికెట్ల వెనుక నిలుచున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో ఓ స్టాంపింగ్ చేసిన భరత్ రెండు అద్భుతమైన క్యాచ్ లను అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. అలాగే భారత రెండో ఇన్నింగ్స్ తర్వాత కూడా మ్యాచ్ చివరి రోజు భరతే వికెట్స్ వెనుక ఉన్నాడు. దాంతో అతను రెండో టెస్ట్ మ్యాచ్ లో తుది జట్టులోకి రావడం ఖాయం అనుకున్నారు అందరూ.. కానీ తాజాగా కోహ్లీ మాటలతో రెండో మ్యాచ్ లో కీపర్ పై క్లారిటీ వచ్చింది.

మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆడని విరాట్ రెండో టెస్ట్ లో జట్టుకు కెప్టెన్ గా వ్యవరించనున్నాడు. అందులో భాగంగా ఈ రోజు ముంబైలో విలేకరుల సమావేశంలో విరాట్ కోహ్లీ… సాహా ప్రస్తుతం పూర్తి ఫిట్ గా ఉన్నాడు అని చెప్పాడు. అతను మెడ నొప్పి నుండి పూర్తిగా కోలుకొని సిద్ధంగా ఉన్నాడు అని ప్రకటించాడు. అయితే మొదటి టెస్ట్ రెండో ఇనింగ్స్ లో సాహా… మెడ నొప్పితోనే జట్టుకు కీలకమైన ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. వరుస వికెట్లు కోల్పోతున్న జట్టును తన అర్ధశతకంతో ఆదుకున్నాడు. దాంతో అందరిచే ప్రశంసలు కూడా అందుకున్నాడు.