Virat Kohli: లతాజీని కలవకపోవడం బాధగా ఉంది: కోహ్లీ ఇంటర్వ్యూ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఇంటర్వ్యూను కోహ్లీ ట్విట్టర్‌లో షేర్ చేయగా అందులోని ఇంట్రస్టింగ్ విషయాలు వైరల్‌గా మారాయి. ఇందులో అవతలి వ్యక్తి అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నలకు కోహ్లీ అంతకంటే ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలోనే లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్‌ను కలవలేకపోయానన్న బాధ తనకు ఉన్నట్లు కోహ్లీ చెప్పాడు.”చరిత్రలో నిలిచిపోయిన ఏ మహిళతో మీరు డిన్నర్‌కు వెళ్లాలని అనుకుంటారు” అన్న ప్రశ్నపై విరాట్ స్పందిస్తూ.. “లతాజీ కలిసే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. ఆమెతో కలిసి మాట్లాడి, ఆమె జీవితం గురించి, ఆమె ప్రయాణం గురించి మరింత తెలుసుకునే అవకాశం వచ్చి ఉంటే బాగుండేది” అని చెప్పుకొచ్చాడు.
Straight from the heart. #ad @StayWrogn pic.twitter.com/FK6cojs7by
Also Read
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ 'స్టాండప్ కామెడీ'.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
- FIFA 2026 Last Chance: మెస్సీ, రొనాల్డోతో పాటు.. ఆ 14 మంది దిగ్గజాలకు ఇదే ఆఖరి వరల్డ్ కప్..
- IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
— Virat Kohli (@imVkohli) January 31, 2023
ఇక ఇదే ఇంటర్వ్యూలో లెజెండరీ బాక్సర్ మహ్మద్ అలీని కూడా విరాట్ గుర్తు చేసుకున్నాడు. “ఒకవేళ ఓ దీవిలో మీరు మీ కుటుంబ సభ్యులు కాకుండా ఎవరితో కలిసి ఓ దీవిలో చిక్కుకుపోవాలని అనుకుంటారు” అని ప్రశ్నించగా.. మహ్మద్ అలీ అని విరాట్ సమాధానమిచ్చాడు. ఈ అమెరికన్ బాక్సర్‌కు ఆల్ టైమ్ గ్రేటెస్ట్ హెవీ వెయిట్ బాక్సర్‌గా పేరుంది. తనకు అత్యంత సంతోషకరమైన ప్లేస్ తన ఇల్లే అని కూడా ఈ సందర్భంగా విరాట్ చెప్పాడు. తన జీవితంలో ప్రయత్నించిన అత్యంత విచిత్రమైన డైట్ ఏది అని అడిగితే.. తనకు 24 ఏళ్ల వయసు వచ్చే వరకూ తిన్నదంతా అదే అని, తాను ప్రపంచంలోని జంక్ ఫుడ్ మొత్తం తినేవాడినని కోహ్లీ చెప్పాడు. ప్లాంకింగ్‌లో తన రికార్డు టైమ్ మూడున్నర నిమిషాలని కూడా కోహ్లీ తెలిపాడు. కోహ్లీ ఫిట్‌నెస్ ఏ స్థాయిలో ఉంటుందో తన ప్లాంకింగ్ టైమ్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ ఇంటర్వ్యూలో ఇది తొలి పార్ట్ మాత్రమే. రెండో ఎపిసోడ్ కూడా రానుందని వీడియో చివర్లో వెల్లడించారు. ప్రస్తుతం న్యూజిలాండ్ టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. రిషికేష్‌లోని ఓ ఆశ్రమంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కాబోయే నాలుగు టెస్టుల సిరీస్ కోసం త్వరలోనే అతడు టీమిండియాతో చేరనున్నాడు.
తాజావార్తలు
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
-
Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
-
Salim Kumar Passed Away : ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత.!
-
Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
-
NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!