Asaram Bapu: అత్యాచార కేసులో ఆశారాం బాపునకు జీవిత ఖైదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనేక లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబా ఆశారాం బాపు కేసుపై కీలక తీర్పు వెలువరించింది గుజరాత్ గాంధీనగర్ సెషన్స్ కోర్టు. మోటేరా ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశారాం బాపు, ఆయన కుమారుడు తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించింది సూరత్‌కు చెందిన ఓ మహిళా భక్తురాలు. పదేళ్ల కిందట బాధితురాలు చేసిన కంప్లయింట్‌పై తాజాగా కోర్టు తీర్చునిచ్చింది. ఈ కేసులో ఆయనను దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది. ఇదే కేసులో నిందితులైన ఆశారాం కుమారుడు నారాయణ్ సాయి, భార్య లక్ష్మి, కుమార్తె భారతి, నలుగురు మహిళా అనుచరులను మాత్రం నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు. మరో అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఆశారాం బాపు ప్రస్తుతం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైలులో ఉన్నారు. ఆశారాం బాపు గతంలో అధ్యాత్మిక గురువుగా ఎందరో శిష్యులను సంపాదించుకున్నారు. దేశ విదేశాల్లో కేంద్రాలను స్థాపించారు. చివరకు ఇలా కటకటాలపాలయ్యారు.
Liver Cirrhosis: మీ లివర్‌ని వీటితో ఆరోగ్యంగా ఉంచుకోండి..
Also Read
- Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
- itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
- Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
ఆశారాంను కోర్టు దోషిగా నిర్ధారించడంతో ఆయనకు గరిష్ఠంగా జీవిత ఖైదు.. లేనిపక్షంలో కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష విధించాల్సి ఉంది. అయితే జోధ్‌పూర్‌లో ఇలాంటి మరో కేసులో ఆయన ఇప్పటికే దోషిగా తేలారని, అందుకే నేరాలు చేయడం అలవాటైన వ్యక్తి అని వాదనలు ముగిసిన తర్వాత లాయర్ కోడెకర్ కోర్టు వెలుపల మీడియాతో అన్నారు. ఆశారాంను సాధారణ నేరస్థుడిగా పరిగణించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శిష్యురాలిగా ఉన్న యువతిని మొతెరాలోని తన ఆశ్రమంలో బంధించి ఆమెపై అత్యాచారం చేసినందుకుగానూ కఠిన శిక్ష విధించాలని కోర్టును కోరినట్లు చెప్పారు. బాధితురాలికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఆశారాం బాపూనకు భారీ జరిమానా విధించాలని ప్రాసిక్యూటర్ అన్నారు. జైలులో ఉన్న దేవుడికి పదేళ్ల జైలు శిక్ష విధించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని డిఫెన్స్ లాయర్ అన్నారు.
తాజావార్తలు
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
Kareena – Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
-
Honor X9e Pro: 11,000mAh బ్యాటరీతో హానర్ X9e ప్రో 5G లాంచ్.. 10,000 నిట్స్ డిస్‌ప్లే, 108MP కెమెరా
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
-
TN SESHAN: రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక్క మొనగాడు..! శేషన్ ఇప్పుడు ఉండి ఉంటేనా..!
ట్రెండింగ్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!