Virat Kohli: నేను ఎప్పుడూ సన్నద్ధతను నమ్మను.. విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
- నేను ఎప్పుడూ సన్నద్ధతను నమ్మను
- బంతితో ఎప్పుడూ నేను టచ్‌లోనే ఉన్నా
- నేను ఎప్పుడూ శారీరకంగా ఫిట్‌గా ఉంటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం తన వయసు 37 ఏళ్లు అని, ఇప్పటికీ ప్రతి మ్యాచ్‌కు ముందు రోజు ఆటకు సంబంధించి మదిలోనే విజువలైజ్ చేసుకుంటా అని టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. తాను ఎప్పుడూ శారీరకంగా ఫిట్‌గా ఉంటా అని, మానసికంగానూ సిద్ధమై మ్యాచ్‌లు ఆడుతా అని చెప్పాడు. కఠిన సాధన చేస్తేనే మంచి ఫలితం వస్తుందనే దానిని తాను నమ్మనని, మానసికంగా ముందే సిద్ధమవుతా అని పేర్కొన్నాడు. ఫిట్‌నెస్ విషయంలో ఎలాంటి సమస్య లేదని, మానసికంగా దృఢంగా ఉంటే అద్భుతంగా ఆడవచ్చు అని విరాట్ చెప్పుకొచ్చాడు. ఆదివారం రాంచిలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే విరాట్ సెంచరీ (135) చెలరేగాడు.
రాంచి వన్డేలో అద్భుతమైన శతకం చేసిన విరాట్ కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ సందర్భంగా కింగ్ మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ సన్నద్ధతను నమ్మనని, తన సన్నద్ధత మానసికమైనదని వివరించాడు. ‘నా కెరీర్‌లో 300కి పైగా వన్డేలు ఆడాను. బంతితో ఎప్పుడూ నేను టచ్‌లోనే ఉన్నా. ప్రాక్టీస్ సమయంలో హిట్టింగ్ చేయడంపై దృష్టి పెడతా. నెట్స్‌లో గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తే.. ఆ ప్రభావం మ్యాచ్‌లో ఆట తీరుపై పడుతుంది. ఆడుతూ ఉంటే ఫామ్‌లోకి రావడం కష్టమేమీ కాదు. నేను ఎప్పుడూ శారీరకంగా ఫిట్‌గా ఉంటా. మానసికంగా సిద్ధమై మ్యాచ్‌లు ఆడుతాను. రాంచీలోనూ అదే చేశా’ అని విరాట్ తెలిపాడు.
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read: Virat Kohli Test Comeback: టెస్టుల్లోకి పునరాగమనం.. క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ!
‘నాకు ఇపుడు 37 ఏళ్లు. ఇప్పటికీ ప్రతి మ్యాచ్‌కు ముందు రోజు ఆటకు సంబంధించి నా మనసులో విజువలైజ్ చేసుకుంటా. ఆ విజువలైజ్‌లోకి బౌలర్లు, ఫీల్డర్లు వస్తారు. రాంచి పిచ్ తొలి 25 ఓవర్లలో ఓ రకంగా, ఆ తర్వాత మరొకలా మారింది. అందుకే బంతి కోసం వేచి చూసి ఆడాలనుకున్నా. పిచ్ పరిస్థితులకు తగినట్టు నా ఆటను మార్చుకున్నా. కఠిన సాధన చేస్తేనే ఇలా వస్తుందనే దానిని నేను అస్సలు నమ్మను. ప్రతి మ్యాచ్‌కు ముందు మానసికంగా సిద్ధమవుతా. ఫిట్‌నెస్ విషయంలో నాకు ఏ సమస్య లేదు. మానసికంగా దృఢంగా ఉంటే బాగా ఆడొచ్చు’ అని విరాట్ కోహ్లీ చెప్పాడు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!