NTV Telugu Site icon

Virat Kohli: బంగ్లాదే‌శ్‌ మ్యాచ్‌లో హైలెట్‌గా విరాట్ కోహ్లీ “నో లుక్” సిక్స్.. మీరూ చూడండి..

Virat Kohli

Virat Kohli

Virat Kohli: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా శనివారం సూపర్-8లో భారత్, బంగ్లాదేశ్‌తో తలపడింది. అంటిగ్వా వేదికగా ఈ మ్యచ్ జరిగింది. హర్దిక్ పాండ్యా ఫెంటాస్టిక్ హాఫ్ సెంచరీతో పాటు విరాట్ కోహ్లీ, దూబే, రిషబ్ పంత్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో భారత్ భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 రన్స్ చేసింది. హర్దిక్ పాండ్యా 27 బాల్స్‌లో 50 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ 24 బాల్స్‌లో 36, విరాట్ కోహ్లీ 28 బాల్స్‌లో 37, శివమ్ దూబే 24 బాల్స్‌లో 34 రన్స్ చేయడంతో ఇండియా భారీ స్కోర్ సాధించింది. బంగ్లా బౌలర్లలో తన్జిమ్ హసన్, రిషద్ హుస్సేన్ చెరో 2 వికెట్లు తీయగా, షకీబ్ ఒక వికెట్ తీశాడు.

Read Also: IND vs BAN: రాణించిన టీమిండియా బ్యాటర్లు.. బంగ్లా ముందు భారీ టార్గెట్

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన సిక్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. మంచి టచ్‌లో కనిపించిన కోహ్లీ మూడు సిక్స్‌ల సాయంతో 37 పరుగులు చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో కోహ్లీ కోట్టిన సిక్స్ మ్యాచ్‌కే ఆకర్షణగా నిలిచింది. కోహ్లీ కొట్టిన ‘నో లుక్ సిక్స్’’ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో తాన్జిమ్ స్లో బాల్‌కి కోహ్లీ ఔట్ అయ్యాడు.

Show comments