Site icon NTV Telugu

Virat Kohli ODI Hundreds: కోహ్లీ బ్యాక్ టూ బ్యాక్ సెంచరీలు.. బ్యాటింగ్లో దుమ్మురేపిన రుత్రాజ్

Virat

Virat

Virat Kohli ODI Hundreds: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాక్ టూ బ్యాక్ శతకాలతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో కింగ్ అద్భుత ఫామ్ పరంపర కొనసాగుతుంది. తొలి వన్డేలో శతకంతో చెలరేగిన కోహ్లీ.. రెండో వన్డేలో కేవలం 90 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఈ సందర్భంగా తన వన్డే కెరీర్లో 53వ శతకాన్ని విరాట్ నమోదు చేసుకున్నారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (14), యశస్వి జైస్వాల్ ( 22) వికెట్లు పడిపోయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ, రుతురాజ్ కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.

Read Also: Modi Farming Mantra: ‘‘ఒక ఎకరం-ఒక సీజన్’’.. సహజ వ్యవసాయంపై మోడీ కొత్త మంత్రం..

మరోవైపు, సఫారీతో జరుగుతున్న రెండో వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ చెలరేగి ఆడాడు. తొలి మ్యాచ్ (8 పరుగులు)లో నిరాశపర్చినా ఈ మ్యాచ్లో సూపర్ సెంచరీతో అదరగొట్టేశాడు. ప్రొటీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ.. కేవలం 77 బంతుల్లోనే 12 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి శతకం బాదేశాడు. కాగా, వన్డేల్లో రుతురాజ్ కి వన్డేల్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.

Exit mobile version