NTV Telugu Site icon

Virat Kohli: గంగూలీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్.. ఏం చేశాడో తెలుసా?

Kohli Vs Ganguly

Kohli Vs Ganguly

Virat Kohli Gives Return Gift To Sourav Ganguly: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు & ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ మధ్య చాలాకాలం నుంచి విభేదాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే! కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించినప్పుడు మొదలైన వీరి మధ్య గొడవ.. క్రమంగా ముదురుతూ వస్తోంది. రీసెంట్‌గా ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు వెలుగుచూసిన పరినామాల నేపథ్యంలో.. వీరి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గంగూలీకి కోహ్లీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..

Yo Yo Honey Singh: హీరోయిన్‌తో డేటింగ్.. రెడ్‌హ్యాండెడ్‌గా బుక్.. వీడియో వైరల్

చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగినప్పుడు.. గంగూలీ వైపు కోహ్లీ పలుమార్లు గుర్రుగా చూశాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్లేయర్లందరూ షేక్ హ్యాండ్ ఇస్తున్న సమయంలో.. కోహ్లీకి గంగూలీ షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే ముందుకు దాటేశాడు. ఆ టైంలో కోహ్లీ మరో ప్లేయర్‌తో మాట్లాడుతున్నట్టుగా మనం గమనించవచ్చు. గంగూలీ తన కోసం వెయిట్ చేయకుండా అలా ముందుకు వెళ్లిపోవడంతో.. కోహ్లీ అతనివైపు మరోసారి గుర్రుగా చూసినట్టు చూసి వెళ్లిపోయాడు. బహుశా తనకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదనే కోపమో ఏమో తెలీదు కానీ.. లేటెస్ట్‌గా కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో గంగూలీని అన్‌ఫాలో చేశాడు. అయితే.. గంగూలీ మాత్రం కోహ్లీని ఇంకా ఫాలో అవుతూనే ఉన్నాడు. మరి, ఇందుకు గంగూలీ ఎలా సమాధానం ఇస్తాడా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Live-In Relationship: భర్తతో విడాకులు.. డ్రైవర్‌తో సహజీవనం.. కట్ చేస్తే..

ఇదిలావుండగా.. ఏప్రిల్ 15వ తేదీన డీసీ, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 23 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే! తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (50) అర్థశతకంతో చెలరేగాడు. అనంతరం 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులకే పరిమితం అయ్యింది. ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో, ఢిల్లీ బ్యాటర్లు చతికిలపడ్డారు. ఆర్సీబీ బౌలర్లలో వైశాక్ విజయ్ కుమార్ 4 ఓవర్లలో 20 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.

Show comments