Virat Kohli Creates 4 Records With PBKS vs RCB Match: మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 24 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే! ఈ మ్యాచ్‌లో ఆర్సీబీకి స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ.. ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 47 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ సహకారంతో అతను 59 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే కోహ్లీ నాలుగు రికార్డులను నమోదు చేశాడు.
Extramarital Affair: ఆమె పాలిట శాపంగా మారిన వివాహేతర సంబంధం.. అసలేమైందంటే?
ఈ మ్యాచ్‌లో 59 పరుగులతో విరుచుకుపడిన కింగ్ కోహ్లీ.. టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌గా 6500 పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడు. ఐపీఎల్‌లో 229 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. మొత్తం 6903 పరుగులు చేయగా, అందులో ఆర్సీబీ కెప్టెన్‌గా 5333 పరుగులు సాధించాడు. అలాగే టీమిండియా టీ20 కెప్టెన్‌గా 1570 పరుగులు నమోదు చేశాడు. ఇలా టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌గా 6500 పరుగులు చేసిన కోహ్లీ.. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. ఇక ఈ మ్యాచ్‌లో 5 ఫోర్లు కొట్టడంతో.. టోటల్ ఐపీఎల్‌లో 600 ఫోర్ల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా.. ఐపీఎల్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో 730 ఫోర్లతో శిఖర్ ధావన్ అగ్రస్థానంలోనూ, 608 ఫోర్లతో ఫోర్లతో డేవిడ్ వార్నర్ రెండో స్థానంలోనూ ఉన్నారు.
David Warner: డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత.. రోహిత్ శర్మ రికార్డ్ బద్దలు
పంజాబ్ కింగ్స్‌పై చేసిన అర్ధ సెంచరీతో.. టీ20లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఈ జాబితాలో 96 అర్ధశతకాలతో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లీ 89 హాఫ్ సెంచరీలతో రెండు స్థానానికి చేరుకున్నాడు. అలాగే.. టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు 30 ప్లస్ స్కోర్లు సాధించిన బ్యాట్స్‌మెన్‌గానూ కింగ్ కోహ్లీ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 30 ప్లస్ స్కోరు చేయడం కోహ్లీకి ఇది వందోసారి. దీంతో.. ఐపీఎల్‌లో వంద 30 ప్లస్ స్కోరు నమోదు చేసిన తొలి ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.