Site icon NTV Telugu

Virat Kohli: విరాట్ కోహ్లీకి అభినందనల వెల్లువ.. ప్రధాని మోడీ, సచిన్ ట్వీట్స్..

Pm Modi

Pm Modi

Virat Kohli: కింగ్ విరాట్ కోహ్లీకి దేశవ్యాప్తంగా అభినందనలు అందుతున్నాయి. ఈ రోజు న్యూజిలాండ్‌తో ముంబైలో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచులో విరాట్ కోహ్లీ క్రికెట్ హిస్టరీలోనే రికార్డ్ క్రియేట్ చేశారు. సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డును బద్ధలు కొడుతూ.. 50వ సెంచరీ సాధించారు. 113 బంతుల్లో 117 రన్స్ సాధించాడు. ఈ ఘనత సాధించినందుకు విరాట్ కోహ్లీని ప్రధాని నరేంద్రమోడీ, హోమంత్రి అమిత్ షాతో పాటు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభినందించారు. ఈ మేరకు వారు ఎక్స్(ట్విట్టర్) ద్వారా అభినందనలు తెలియజేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ, 50వ సెంచరీ సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విరాట్ కోహ్లీ తన 50 సెంచరీని సాధించమే కాకుండా అత్యుత్తమ క్రీడాస్పూర్తి నిర్వచించే పట్టుదలకు ఉదాహరణగా నిలిచారు. ఈ అద్బుతమైన మైలురాయి, అతని నిరంతర అంకిత భావానికి, అసాధారణ ప్రతిభకు నిదర్శనం. నేను అతనికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అతను భవిష్యత్ తరాలకు బెంచ్‌మార్క్ సెట్ చేస్తూనే ఉన్నాడు’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.

Read Also: Deepika Padukone: దీపికా కూడా నెపోటిజం బాధితురాలేనా!.. హాట్‌టాపిక్‌గా హీరోయిన్‌ కామెంట్స్‌

సచిన్ ట్వీట్ చేస్తూ.. ‘‘నేను తొలిసారిగా మిమ్మల్ని ఇండియన్ డ్రెస్సింగ్ రూంలో కలిసినప్పుడు.. మిగతా ప్లేయర్లు ఆట పట్టిస్తూ, నా పాదాలు తాకాలని ప్రాంక్ చేశారు. ఆ రోజు నేను నవ్వు ఆపుకోలేకపోయాను.. కానీ వెంటనే మీ పాషన్, నైపుణ్యం నా హృదయాన్ని తాకారు. ఆ యువకుడు ‘విరాట్’గా ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఒక భారతీయుడి నా రికార్డును బద్దలు కొట్టినందుకు మాత్రమే కాకుండా, ప్రపంచకప్ సెమీస్‌లో నా హోం గ్రౌండ్‌లో ఈ రికార్డు సాధించినందుకు గర్వంగా ఉంది’’ అంటూ పోస్ట్ చేశారు.

‘‘వన్డే క్రికెట్లో 50వ సెంచరీ సాధించి, చారిత్రక మైలురాయిని సాధించినందుకు విరాట్ కోహ్లీకి నా అభినందనలు. ఇది మీ అత్యుత్తమ క్రీడా స్పూర్తికి, అంకిత భావానికి, నిలకడకు నిదర్శనం. మీరు మీ ఆటను మరింత స్థాయికి ఎదగనివ్వండి, దేశం మొత్తం మిమ్మల్ని చూసి గర్విస్తోంది’’ అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.

Exit mobile version