Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammad Kaif on Virat Kohli: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ నిర్దేశించిన 296 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ విజయంలో సెంచరీ హీరోలు కోహ్లీ, శుభ్‌మన్ గిల్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా కింగ్ కోహ్లీ కేవలం 88 బంతుల్లో 139 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టీమిండియాకు సునాయాస విజయాన్ని అందించాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి.
ఈ సెంచరీతో వన్డేల్లో 15 వేల పరుగుల మైలురాయిని అందుకున్న విరాట్ కోహ్లీ.. ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాదు వన్డేల్లో ఇది అతడికి 55వ సెంచరీ. ఇటీవల 2027 వన్డే ప్రపంచ కప్ తన కెరీర్లో చివరిదై ఉండొచ్చనే సంకేతాలు ఇచ్చిన కింగ్.. ఈ ఇన్నింగ్స్‌తో మరోసారి తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని చాటుకున్నాడు. అయితే గతంలో కోహ్లీపై వచ్చిన విమర్శలపై మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పందించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా రెండు సార్లు డకౌట్ అయినప్పుడు కొందరు అభిమానులు కోహ్లీ రిటైర్మెంట్ తీసుకోవాలని సూచించారని గుర్తుచేశాడు. అయితే ఆ తర్వాత కోహ్లీ తన బ్యాట్‌తోనే విమర్శలకు సమాధానం ఇచ్చాడని చెప్పాడు.
Also Read
- Harmanpreet Kaur 91 Runs: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలనం.. స్మృతి మంధాన రికార్డు బద్దలు!
- IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
- Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
- IND-W vs ZIM-W: హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్.!
‘ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ వరుసగా రెండు డకౌట్లు అయ్యాడు. ఇక అతడు ఆడలేడని, రిటైర్మెంట్ తీసుకోవాలని కొందరు అన్నారు. కానీ ఆ తర్వాత కేవలం 11 ఇన్నింగ్స్‌ల్లోనే 900 పరుగులు బాదాడు, అందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాదిలో కోహ్లీ ఆడింది 11 ఇన్నింగ్స్‌లే. అంటే నెలకు సగటున ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. క్రమం తప్పకుండా మ్యాచ్‌లు ఆడకపోయినా వెస్టిండీస్‌పై కోహ్లీ చూపించిన దూకుడు అతడిలోని మరో కోణాన్ని బయటపెట్టింది. సాధారణంగా బౌండరీలతో విరుచుకుపడే కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఏకంగా 9 సిక్సర్లు బాదడం ప్రత్యేకం. గతంలో ఇంత దూకుడు ఎప్పుడూ కనిపించలేదు’ అని కైఫ్ పేర్కొన్నాడు.
‘విరాట్ కోహ్లీకి 37 ఏళ్లు. అతడు సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. కానీ అతడి ప్రధాన ఆయుధం బ్యాట్. అతడి బ్యాట్ పరుగులు చేస్తున్నంత వరకు ఎవరూ అతడిని ప్రశ్నించలేరు. ఎవరూ అతడిని టచ్ చేయలేరు. ఈ విషయాన్ని కోహ్లీ తన ప్రదర్శనతోనే స్పష్టం చేశాడు. ఇప్పుడు జట్టు నుంచి తీస్తారా?. 2027 వన్డే ప్రపంచ కప్ ఆడుతాడు’ అని కైఫ్ చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్‌పై 139 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ వన్డేల్లో 15 వేల పరుగుల మార్క్‌ను దాటాడు. ఈ ఘనత సాధించిన బ్యాటర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ తర్వాత కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అతడి ఇన్నింగ్స్‌లో కనిపించిన దూకుడు, భారీ సిక్సర్లు అభిమానులను ఆకట్టుకున్నాయి.
తాజావార్తలు
-
Harmanpreet Kaur 91 Runs: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలనం.. స్మృతి మంధాన రికార్డు బద్దలు!
-
AP MPTC, ZPTC Elections 2026: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్లు
-
Zohran Mamdani: భారతీయులతో కలిసి గర్బా డ్యాన్స్ చేసిన న్యూయార్క్ మేయర్
-
Realme C01: 6500mAh బ్యాటరీతో కొత్త రియల్మీ ఫోన్.. 120Hz డిస్ప్లే, ధర వివరాలు!
-
Pulivendula Tension: పులివెందులలో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ అభ్యర్థుల ఇళ్ల వద్ద వాహనాల దహనం
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!