Site icon NTV Telugu

Vaibhav Sooryavanshi: అలసట లేదు, టెన్షన్ లేదు.. బీహార్ ‘బాద్‌షా’ వైభవ్‌ నేపథ్యం ఇది!

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వయసు కేవలం 14 ఏళ్లు.. కానీ చేతిలో బ్యాట్ పట్టుకున్నప్పుడు మాత్రం అనుభవజ్ఞుడిలా కనిపిస్తున్నాడు. 2026 అండర్‌-19 వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్ ఆడుతున్నంత సేపు అతడి ముఖంలో చిరునవ్వు లేదు, అలసట లేదు, టెన్షన్ లేదు.. పరుగులు బాదాలనే కసి మాత్రమే కనిపంచింది. ఒక్కో షాట్‌కి 100 మీటర్ల దూరం వెళ్లే సిక్సర్లు, మైదానం నలు వైపులా బౌండరీల మోత. వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. 100 పరుగుల ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 8 ఫోర్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లకు నిద్ర లేకుండా చేశాడు. మొత్తంగా 175 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు.

వైభవ్ సూర్యవంశీ ఒక మధ్యతరగతి రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించాడు. బీహార్ రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతులు అసలే ఉండవు. అంతర్జాతీయ స్థాయి స్టేడియంలు లేవు, సరైన ప్రాక్టీస్ సదుపాయాలు లేవు, ప్రభుత్వ సహకారం అంతంత మాత్రమే. వ్యవస్థలో లోపాలు, అవరోధాలు ఎన్నో ఉన్నా.. వాటన్నింటిని దాటుకుని వైభవ్ తన టాలెంట్‌తోనే ముందుకు దూసుకెళ్తున్నాడు. చిన్న వయసులోనే బీహార్‌ను ప్రాతినిధ్యం వహిస్తూ.. ఆపై భారత జట్టుకు ఎంపిక కావడం అతడి కష్టానికి దక్కిన ఫలితం. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతడి ముఖంలో ఎలాంటి ఎమోషన్ కనిపించదు. 80–90 పరుగుల వద్ద కూడా అలసట లేదనిపిస్తుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా బంతిని గాల్లోకి లేపేస్తూ స్కోర్‌ బోర్డును పరుగెత్తిస్తాడు. ఇదే అతడిని ప్రత్యేకంగా నిలబెడుతోంది.

Also Read: Vaibhav Sooryavanshi Century: వరల్డ్‌కప్ ఫైనల్లో సెంచరీలు.. చరిత్రలో నిలిచిపోయిన ఇన్నింగ్స్‌లు ఇవే!

వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌లో పవర్ ఉంది, టైమింగ్ ఉంది. అంతకంటే ముఖ్యంగా మ్యాచ్‌పై ఆధిపత్యం చూపించే ఆత్మవిశ్వాసం ఉంది. చిన్న వయసులోనే ఇంత పరిపక్వత అంటే.. అది సహజ ప్రతిభకు నిదర్శనం అనే చెప్పాలి. క్రికెట్ పండితులు కూడా అతడిని ఆటకు షాక్ అవుతున్నారు. ‘భవిష్యత్తు స్టార్’గా అతడిని అభివర్ణిస్తున్నారు. పేదరికం, వనరుల లేమి, వ్యవస్థ లోపాలు అన్నింటిని జయించి.. ఎదిగిన ఒక బాలుడి పోరాటం. భారత క్రికెట్‌కు లభించిన ‘టారషా హువా హీరా’ (భారతదేశంకు ఓ వజ్రం దొరికింది) వైభవ్ సూర్యవంశీ. సరైన మార్గదర్శకత్వం, మద్దతు లభిస్తే.. రాబోయే రోజుల్లో అతడు దేశానికి ఎన్నో విజయాలు అందించడం ఖాయం.

Exit mobile version