Site icon NTV Telugu

Trump: ట్రంప్ రాకతో యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌‌లో గందరగోళం.. అభిమానుల ఆగ్రహం

Trump2

Trump2

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాకతో టెన్నిస్ ప్రియులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ట్రంప్ వస్తుండడంతో ఆట ఆలస్యంగా మొదలైంది. దీంతో అభిమానులు, ప్రేక్షకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాస్తవంగా ట్రంప్ వస్తున్నట్లు ఎవరికీ తెలియలేదు. అలాంటి సమాచారం కూడా మైకుల్లో ప్రకటించలేదు. కానీ హఠాత్తుగా ఆయన బిగ్ స్క్రీన్‌పై కనిపించారు. దీంతో ట్రంప్ రాకతోనే యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్ మ్యాచ్ ఆలస్యం అయిందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Vande Bharat Sleeper: పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్.. ప్రారంభ తేదీ ఎప్పుడంటే..!

కార్లోస్ అల్కరాజ్-జానిక్ సిన్నర్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. చూసేందుకు ఆర్థర్ ఆషే స్టేడియానికి ట్రంప్ వచ్చారు. అయితే ఆయన రాక కారణంగా అరగంట పాటు ఆలస్యం అయింది. భద్రతా సిబ్బంది తనిఖీలు చేయడం.. మ్యాచ్‌కు ఆటంకం కలగడంతో టెన్నిస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి వేదిక దగ్గర ట్రంప్ వస్తున్నట్లు ఎలాంటి ప్రకటన చేయకపోవడం విశేషం. సడన్‌గా తెరపై కనిపించారు. ట్రంప్ కారణంగా అభిమానులెవరూ సంతోషంగా లేరని నెటిజన్లు పేర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి: Tollywood : టాలీవుడ్ ఆడియన్స్ మార్పు కోరుకుంటున్నారా.. స్టార్ డైరెక్టర్స్ ఇప్పటికైనా కళ్లు తెరుస్తారా…?

 

Exit mobile version