ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతానందట ఇలా ఉంది ప్రెజెంట్ టాలీవుడ్ పరిస్థితి. పాన్ వరల్డ్, పాన్ ఇండియా చిత్రాలంటూ పరుగులు పెడుతూ రూట్స్ మర్చిపోతుంది. అన్నింటిలోనూ యాక్షన్స్ నింపేస్తూ ఆడియన్స్ ముందు బిల్డప్ ఇస్తే బెడిసికొడుతుంది. యాక్షన్, అడ్వెంచర్సే అవసరం లేదు, లవ్ స్టోరీలు అంతకంటే వద్దు కంటెంట్ కమ్ కామెడీ ఉంటే చాలని క్లియర్ రిజల్ట్ ఇస్తున్నారు తెలుగు ఆడియన్స్. టాలీవుడ్ పాన్ ఇండియాను దాటి గ్లోబల్ స్థాయికి ఎదిగింది అన్నది ఎంత నిజమో మళ్లీ డౌన్ ఫాల్ అవుతుందన్నది కూడా నమ్మలేని వాస్తవం. భారీగా ఖర్చు పెట్టి, వరల్డ్ క్లాస్ మూవీస్ అందించే క్రమంలో చిన్న చిత్రాలను మర్చిపోతోంది. అందులోనూ యాక్షన్, థ్రిల్లర్, అడ్వెంచర్స్, మైథాలజీ ఫిల్మ్ అంటూ కామెడీని మిస్ చేస్తోంది. కానీ కామెడీ ఎంటర్టైనర్స్, స్మాల్ బడ్జెట్ కమ్ ప్రాంతీయ భాషా చిత్రాలే టాలీవుడ్‌కు ప్రాణం పోస్తున్నాయి.
Also Read : Kollywood : ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. కన్ఫమ్ చేసిన స్టార్ హీరో
ఈ ఏడాది భారీ హిట్టుగా నిలిచిన టాలీవుడ్ ఫిల్మ్ సంక్రాంతికి వస్తున్నాం. ఇందులో వెంకటేష్ మినహా మిగిలిన ఆర్టిస్టులంతా స్టార్ట్ కాస్ట్ కాదు. కానీ కామెడీతో కితకితలు పెట్టించి థియేటర్లకు ఆడియన్స్ రప్పించడంతో సక్సెస్ అయ్యాడు అనిల్ రావిపూడి. రూ. 50 కోట్లతో తెరకెక్కిన ఈ ఫిల్మ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. కేవలం తెలుగులోనే రిలీజైన ఈ సినిమా ఇప్పటి వరకు హయ్యెస్ట్ గ్రాసర్ టాలీవుడ్ ఫిల్మ్‌గా నిలిచింది. కథ ఏం లేదు జస్ట్ కామెడీనే అంటూ మ్యాడ్ స్క్వేర్ తీసుకు వచ్చాడు నిర్మాత నాగవంశీ. అన్నట్లుగా స్టోరీ లేకపోయినా హిలేరియస్‌గా నవ్వించడంలో సక్సెస్ అయ్యిందీ టీం. దీంతో ఆడియన్స్ హిట్ బాట పట్టించారు. రూ. 30-రూ. 40 కోట్లతో తెరకెక్కిన ఈ ఫిల్మ్ నియర్లీ రూ. 70 కోట్లను రాబట్టుకుంది. ఇక మేలో టూ డిఫరెంట్ జోనర్ ఆఫ్ కామెడీ ఫిల్మ్స్ సందడి చేశాయి. రొమాంటిక్ కామెడీగా వచ్చిన సింగిల్, హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన శుభం మంచి హిట్స్ నమోదు చేశాయి. ఈ రెండూ కూడా భారీగా వసూళ్లు చేసుకోలేకపోయినా నష్టాలైతే తెచ్చిపెట్టేలేదని టాక్. సో మాకు స్టార్ కాస్ట్ అవసరం లేదు ఎంటెర్టైన్ చేయగలిగితే చాలు థియేటర్ కి వస్తామని నిరూపిస్తున్నారు ప్రేక్షకులు. మరి మన మేకర్స్ ఇకనుండైనా మారతారో లేదో.