NTV Telugu Site icon

కరోనా నిబంధనల పుస్తకాన్ని విడుదల చేసిన ఒలింపిక్స్ నిర్వాహకులు

కరోనావైరస్ వ్యాప్తి నడుమ కొత్త నిబంధనలు స్పష్టంగా తెలియజేసేందుకు 33 పేజీల పుస్తకాన్ని ఒలింపిక్స్ నిర్వాహకులు విడుదల చేశారు. అంతర్జాతీ ప్రేక్షకులు కేవలం టీవీల్లోనే ఒలింపిక్స్‌ను చూడాల్సి ఉంటుంది. కేవలం స్థానికులకు మాత్రమే వీటిని చూసేందుకు అనుమతి ఉంది. వారు కూడా కరోనా కట్టడికి ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది. పాటలు, డ్యాన్సులతో స్టేడియంలలో హంగామా చేయడంపైనా ఆంక్షలు అమలులో ఉన్నాయి.

అటు అంతర్జాతీయ వాలంటీర్లు కూడా టోక్యో రావడానికి వీల్లేదు. జపాన్‌లో అడుగుపెట్టిన వెంటనే క్రీడాకారులంతా 14 రోజుల క్వారంటైన్ పాటించాలి. నేరుగా వారు ట్రైనింగ్ శిబిరాల్లోకి వెళ్లాలి. క్రీడాకారులందరికీ ప్రతి నాలుగు రోజులకు ఒకసారి కరోనా టెస్టు నిర్వహిస్తారు. ఒకవేళ వారికి పాజిటివ్ వస్తే, పోటీల్లో పాల్గొనేందుకు అనుమతించరు. క్రీడాకారులంతా వ్యాక్సీన్లు తీసుకోవడం తప్పనిసరేమీ కాదు. పర్యాటక ప్రాంతాలు, రెస్టారెంట్లు, బార్లను చూసేందుకు క్రీడాకారులకు అనుమతి లేదు.

ఒలింపిక్స్ గేమ్స్‌కు కొన్ని రోజుల ముందే, టోక్యోలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఇది ఒలింపిక్స్ సమయంలోనూ కొనసాగుతుంది. ఒలింపిక్స్ జులై 23న మొదలయ్యే ఒలింపిక్స్‌ ఆగస్టు 8 వరకు కొనసాగుతాయి. ఆగస్టు 26 వరకు అత్యవసర పరిస్థితి కొనసాగుతుందని జపాన్ ప్రధాని ఇప్పటికే స్పష్టంచేశారు.

జపాన్‌లో ఏప్రిల్ నెలలో కరోనావైరస్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. అయితే, మొత్తంగా చూసుకుంటే జులైనాటికి ఇక్కడ 8 లక్షల వరకు కేసులు నమోదుఅయ్యాయి. మరణాల సంఖ్య 15,000కు చేరుకుంది.