కరోనావైరస్ వ్యాప్తి నడుమ కొత్త నిబంధనలు స్పష్టంగా తెలియజేసేందుకు 33 పేజీల పుస్తకాన్ని ఒలింపిక్స్ నిర్వాహకులు విడుదల చేశారు. అంతర్జాతీ ప్రేక్షకులు కేవలం టీవీల్లోనే ఒలింపిక్స్‌ను చూడాల్సి ఉంటుంది. కేవలం స్థానికులకు మాత్రమే వీటిని చూసేందుకు అనుమతి ఉంది. వారు కూడా కరోనా కట్టడికి ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది. పాటలు, డ్యాన్సులతో స్టేడియంలలో హంగామా చేయడంపైనా ఆంక్షలు అమలులో ఉన్నాయి. అటు అంతర్జాతీయ వాలంటీర్లు కూడా టోక్యో రావడానికి వీల్లేదు. జపాన్‌లో అడుగుపెట్టిన వెంటనే క్రీడాకారులంతా 14…