Gongidi Trisha: రెండేళ్ల వయసు నుంచే క్రికెట్ వైపు.. నా కూతురు ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉంది
- అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ 2025
- గొంగిడి త్రిష రెండేళ్ల వయసు నుంచే క్రికెట్ వైపు
- నా కూతురు ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో యువ కెరటం తెలుగమ్మయి గొంగిడి త్రిష దేశ ఖ్యాతిని నలుదిశలా చాటిచెప్పింది. అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేసింది.32 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. బౌలింగ్ లోనూ సత్తా చాటి మూడు వికెట్లను ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భంగా మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది గొంగిడి త్రిష. మేము పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. మ్యాచ్ లో ఎలాంటి ఒత్తిడి తీసుకోలేదన్నారు. ప్రతి మ్యాచ్ లోనూ తన వంతు పాత్ర ఏంటి? జట్టు విజయంలో అండగా నిలవాలని మాత్రమే ఆలోచించానని తెలిపింది.
ఇక మరో ప్లేయర్ ద్రితి గురించి మాట్లాడుతూ.. తను కూడా టాలెంటెడ్ ప్లేయర్, కానీ ఈ సారి తనకు అవకాశం రాలేదు. అవకాశం వస్తే భవిష్యత్తులో అద్భుతాలు సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక నుంచి మరింత కష్టపడి సీనియర్ టీమ్ లో చోటు సాధించడమే తన లక్ష్యమని చెప్పారు. ఇక తన తండ్రి గురించి చెప్తూ.. నా సక్సెస్ లో మా నాన్న ఉన్నారు. తన అందించిన ప్రోత్సాహం మరువ లేనిది. నా కెరీర్ కోసం నాన్న ఎంతో కష్టపడ్డారు. తన వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను అని అన్నారు.
Also Read
- Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
- Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
- Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం.. చరిత్ర స్పష్టించిన మీరాబాయి చాను..
- VVS Laxman: జింబాబ్వే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వీవీఎస్ లక్ష్మణ్‌పై ప్రశంసల జల్లు..
త్రిష తండ్రి రామిరెడ్డి మాట్లాడుతూ.. తనకు రెండేళ్ల వయసు నుంచే క్రికెట్ వైపు మళ్లించాను అని అన్నారు. నా కూతురు ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉంది. సీనియర్ జాతీయ టీంలో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా కృషి చేస్తోందని వెల్లడించారు. మరో క్రికెటర్ ధృతి మాట్లాడుతూ.. భారత్ గెలుపులో త్రిష పోరాటం మరువలేనిది అని చెప్పింది. తనకు ప్లేయింగ్ 11లో చోటు దక్కనప్పుడు కాస్త బాధగా అనిపించిందని, కానీ, దేశానికి వరల్డ్ కప్ సాధించిన టీమ్ లో నేను ఉండడం చాలా గర్వంగా ఉందని అన్నారు.
తాజావార్తలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
-
Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం.. చరిత్ర స్పష్టించిన మీరాబాయి చాను..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!