T20 World Cup: జింబాబ్వేపై టీమిండియా ఘనవిజయం.. సెమీస్‌లో ఇంగ్లండ్‌తో ఢీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో మెల్బోర్న్ వేదికగా జరిగిన నామమాత్ర మ్యాచ్‌లో పసికూన జింబాబ్వేపై 71 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. భారత్ నిర్దేశించిన 187 పరుగుల టార్గెట్ బరిలోకి దిగిన జింబాబ్వేను భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్లోనే దెబ్బ కొట్టాడు. ఫస్ట్ బాల్కే మధెవెరేను వెనక్కి పంపాడు. తర్వాత జింబాబ్వే వరుసగా వికెట్లు కోల్పోయి చివరికి 115 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీశాడు. షమీ, హార్దిక్ పాండ్యా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. ర్యాన్ బర్ల్ 35, సికిందర్ రజా 34 పరుగులతో రాణించారు. ఈ విజయంతో గ్రూప్-2లో టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంది. భారత్ ఖాతాలో 8 పాయింట్లు ఉన్నాయి.
Read Also: South Africa: దురదృష్టం అంటే ఇదే.. ఖాయం అనుకున్న సెమీస్ బెర్త్ చేజారింది
Also Read
- Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
- IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
- Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
- Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ 'మెధావి బిధూరి'.?
అంతకుముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సూర్యకుమార్‌కు దక్కింది. అతడు 25 బంతుల్లో 6 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కాగా టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. తాజాగా గ్రూప్-2లో టీమిండియా అగ్రస్థానంలో ఉండటంతో గ్రూప్-1లో నెంబర్-2గా ఉన్న ఇంగ్లండ్‌తో నవంబర్ 10న అడిలైడ్ వేదికగా సెమీస్‌లో తలపడనుంది. ఇక గ్రూప్-1లో నెంబర్-1గా ఉన్న న్యూజిలాండ్.. గ్రూప్-2లో రెండో స్థానంలో ఉన్న పాకిస్థాన్‌తో నవంబర్ 9న పోటీ పడనుంది.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్‌లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
-
Bandi Sanjay : ఫీజు బకాయిలపై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్‌కు డెడ్‌లైన్.!
-
Endurance Ship: 100ఏళ్ల రహస్యం..ఓడ మిస్టరీ వీడింది!
-
Kotha Cinema: హైదరాబాద్‌లోనే సినిమాలెందుకు తీయాలంటూ 100 మందితో సింగరేణి కుర్రాడు “కొత్త సినిమా”!**
-
Supreme Court: 20 మంది రెబల్ తృణమూల్ ఎంపీలకు సుప్రీం నోటీసులు..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!