NTV Telugu Site icon

AUS vs IND: ఆస్ట్రేలియా భారీ స్కోర్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

Aus

Aus

AUS vs IND: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (73: 96 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), అలెక్స్ క్యారీ (61; 57 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ శతకాలతో రాణించగా 49.3 ఓవర్లలో 264 రన్స్ కు ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (39), మార్కస్ ల‌బుషేన్ (29)లు కూడా ఫర్వాలేదనిపించారు. జోస్ ఇంగ్లిష్ (11), గ్లెన్ మ్యాక్స్ వెల్ (11)లు పెయిల్ అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో ష‌మీ మూడు వికెట్లు తీశాడు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, ర‌వీంద్ర జ‌డేజా చెరో రెండు వికెట్లు తీశారు. అక్ష‌ర్ ప‌టేల్, హార్దిక్ పాండ్యా త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Read Also: Yogi Adityanath: మతపరమైన అంశాలతో ఆడుకుంటున్నారు.. సమాజ్‌వాదీ పార్టీపై యూపీ సీఎం ఫైర్

అయితే, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే మహ్మద్ ష‌మీ షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్‌లో కేఎల్ రాహుల్ కి క్యాచ్ ఇచ్చి ఓపెన‌ర్ కూపర్ కొన్నోలీ డ‌కౌట్ అయ్యాడు. ఇక, మ‌రో ఎండ్‌లో వ‌న్ డౌన్‌లో వ‌చ్చిన స్టివ్ స్మిత్‌తో క‌లిసి హెడ్ టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇక, రంగంలోకి దిగిన వ‌రుణ్ చక్రవర్తి త‌న తొలి ఓవ‌ర్‌నే ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేశాడు. రెండో వికెట్‌కు హెడ్‌-స్మిత్‌లు 50 రన్స్ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. అయితే, ఆరంభంలో క్రీజులో కుదురుకునేందుకు కాస్త ఇబ్బంది ప‌డిన స్మిత్.. ఆ తర్వాత త‌న‌దైన స్టైల్లో ఆడుతూ ప‌రుగులు సాధించాడు. ఈ క్రమంలో అత‌డు ల‌బుషేన్‌తో మూడో వికెట్‌కు 56 రన్స్, జోష్ ఇంగ్లిష్‌తో క‌లిసి నాలుగో వికెట్‌కు 34 ప‌రుగులు జత చేశారు. ఈ ద‌శ‌తో స్మిత్‌కు అలెక్స్ కేరీ జత కలవడంతో.. వీరిద్దరు టీమిండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలోనే ఆసీస్ కెప్టెన్ 68 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత శ‌త‌కం దిశ‌గా వెలుతున్న అత‌డ్ని ష‌మీ క్లీన్ బౌల్డ్ చేశాడు.

Read Also: PM Modi: జామ్‌నగర్ ఫారెస్ట్ వీడియో పోస్ట్ చేసిన మోడీ.. కనువిందు చేస్తున్న జంతువులు

ఇక, స్టీవ్ స్మిత్-కేరీ జోడి ఐదో వికెట్‌కు 54 రన్స్ జోడించారు. స్మిత్ ఔటైన త‌రువాత అలెక్స్ కేరీ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో.. హాఫ్ సెంచ‌రీ కంప్లీ్ట్ చేసుకున్నాడు.. దూకుడుగా ఆడుతున్న అత‌డిని ఇన్నింగ్స్ చివ‌రిలో అక్షర్ పటేల్ ర‌నౌట్ చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సేపు సమయం పట్టేలేదు. కాగా, టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు తీసుకోగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు తీసుకోగా.. హార్థిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు.