Site icon NTV Telugu

T20 World Cup: బుమ్రా, హర్షల్ పటేల్ వచ్చేశారు .. టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే..!!

Team India

Team India

T20 World Cup: వచ్చేనెలలో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం సెలక్టర్లు భారతజట్టును ప్రకటించారు. గాయాల నుంచి కోలుకున్న స్టార్ బౌలర్ బుమ్రా, కీలక బౌలర్ హర్షల్ పటేల్ జట్టులో స్థానం సంపాదించారు. జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను తీసుకున్నారు. మిగతా టీమ్ అంతా దాదాపు ఆసియా కప్‌లో ఆడిన జట్టునే పరిగణనలోకి తీసుకున్నారు. అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్ స్థానంలో బుమ్రా, హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చారు. అయితే షమీని స్టాండ్ బైగా ప్రకటించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. షమీతో పాటు రవి బిష్ణోయ్, శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్‌లను సెలక్టర్లు స్టాండ్ బైగా ప్రకటించారు. అంతేకాకుండా సొంతగడ్డపై ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో జరిగే టీ20 సిరీస్‌లకు కూడా సెలక్టర్లు టీమ్‌ను ప్రకటించారు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్‌లకు విశ్రాంతి కల్పించారు.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్, బుమ్రా, హర్షల్ పటేల్, భువనేశ్వర్, అర్ష్‌దీప్ సింగ్
స్టాండ్ బై ఆటగాళ్లు: మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్‌

ఆస్ట్రేలియాతో సిరీస్‌కు భారత జట్టు: రోహిత్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, బుమ్రా
దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భారతజట్టు: రోహిత్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్, అర్ష్ దీప్ సింగ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, బుమ్రా

Exit mobile version