IND Vs NZ: ఉప్పల్ వన్డేలో గిల్ డబుల్.. టీమిండియా జిగేల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Vs NZ: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో టీమిండియా పరుగుల వరద పారించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (149 బంతుల్లో 208) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు రోహిత్, గిల్ శుభారంభాన్నిచ్చారు. అయితే 13వ ఓవర్లో రోహిత్‌ను టిక్నర్ ఔట్ చేయడంతో మొదటి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆపై కోహ్లీ (8), ఇషాన్ కిషన్ (5), సూర్యకుమార్ యాదవ్ (31), హార్దిక్ పాండ్యా (28), వాషింగ్టన్ సుందర్ (12), శార్దూల్ ఠాకూర్ (3) విఫలమైనా.. గిల్ మాత్రం ఒంటరి పోరాటంతో టీమిండియాకు భారీ స్కోర్ అందించాడు.
Read Also: Vijay Zol: అండర్-19 టీమిండియా మాజీ కెప్టెన్ అరెస్ట్
Also Read
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
- Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్ల హవా.. పాయింట్ల పట్టికలో పైపైకి..
- Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
ఓవైపు వికెట్లు పడుతున్నా గొప్ప పోరాట స్ఫూర్తితో కివీస్ బౌలర్లపై గిల్ ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలోనే 87 బంతుల్లోనే కెరీర్లో మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆపై జోరు పెంచిన గిల్ 145 బాల్స్‌లో కెరీర్లో తొలి డబుల్ సెంచరీ చేసి అతిపిన్న వయసులో (23 ఏళ్ల 132 రోజులు) ఈ ఘనత సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇషాన్ కిషన్ (24 ఏళ్ల 145 రోజుల్లో) తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇక మొత్తంగా టీమిండియా తరఫున వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఐదో బ్యాటర్ గిల్. గతంలో సచిన్ ,సెహ్వాగ్, రోహిత్, ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీలు చేశారు. అలాగే న్యూజిలాండ్ జట్టుపై ఓ టీమిండియా బ్యాటర్‌కు వన్డేల్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. సచిన్ (186 నాటౌట్) పేరిట ఉన్న రికార్డును గిల్ తిరగరాశాడు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?