NTV Telugu Site icon

ICC Rankings: జింబాబ్వేపై వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్.. టీమిండియా ర్యాంక్ పదిలం

Team India

Team India

ICC Rankings: ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకులను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పులేకుండా టీమిండియా తన మూడో ర్యాంకును నిలబెట్టుకుంది. ఇటీవల జింబాబ్వేతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌ను క్వీన్‌స్వీప్ చేసిన భారత్ మరో మూడు రేటింగ్ పాయింట్లను ఖాతాలో వేసుకొని 111 పాయింట్లతో తమ ర్యాంకును మరింత పదిలం చేసుకుంది. మరోవైపు నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన పాకిస్థాన్‌ సైతం ఒక పాయింట్‌ను పెంచుకుని 107 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. వన్డే ర్యాంకుల్లో న్యూజిలాండ్‌ (124) అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లండ్‌ 119 పాయింట్లతో రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు వరుసగా 5, 6 స్థానాల్లో కొనసాగుతున్నాయి.

Read Also: Ajay Mishra: రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి..

ప్రస్తుతం టీమిండియా ఆసియాకప్ ఆడేందుకు యూఏఈ చేరుకుంది. ఆగస్టు 27న టోర్నీ ప్రారంభం కానుండగా.. ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఆగస్టు 28న పాకిస్థాన్‌తో జరిగే హైఓల్టేజ్ మ్యాచ్‌తో భారత్ తమ పోరును ప్రారంభించనుంది. ఈ క్రమంలో వారం రోజుల ముందుగానే యూఏఈ చేరిన టీమిండియా టైటిలే లక్ష్యంగా సన్నాహకాలను ప్రారంభించనుంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు మూడు రోజులు భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించనున్నారు. కాగా ఆసియా కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత్ బరిలోకి దిగనుంది.

Show comments