Team India Reached West indies: టీమిండియా వరుసబెట్టి సిరీస్‌ల మీద సిరీస్‌లు ఆడుతోంది. ఇటీవల ఇంగ్లండ్‌తో టెస్ట్, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడిన టీమిండియా వచ్చే శుక్రవారం నుంచి వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఈ మేరకు బుధవారం సాయంత్రం భారత జట్టు వెస్టిండీస్ చేరుకుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగే తొలి వన్డే కోసం జట్టు ట్రినిడాడ్ చేరిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సీనియర్ క్రికెటర్లంతా ఈ సిరీస్‌కు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ పర్యటనలో వన్డే జట్టుకు శిఖర్ ధావన్ నాయకత్వం వహించనున్నాడు.
Read Also: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మన్లు
ఈనెల 22న భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. ఈనెల 24న రెండో వన్డే, ఈ నెల 27న మూడో వన్డే జరగనున్నాయి. వన్డేలన్నీ పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోనే జరుగుతాయి. అనంతరం రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ సారథ్యంలో వెస్టిండీస్‌తో టీమిండియా ఐదు టీ20లు ఆడనుంది. వన్డే సిరీస్‌లో రోహిత్, కేఎల్ రాహుల్ వంటి కీలక ఆటగాళ్లు లేకపోవడంతో టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్‌కు జతగా రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. అయితే రుతురాజ్‌కు ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ నుంచి తీవ్ర పోటీ ఉండనుంది. వికెట్ కీపర్‌గా ఇషాన్‌కు జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ మరో వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకుంటే మాత్రం ఇషాన్ కిషన్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.
BCCI Latest Tweet:
Trinidad – WE ARE HERE! 👋😃#TeamIndia | #WIvIND pic.twitter.com/f855iUr9Lq
— BCCI (@BCCI) July 20, 2022