NTV Telugu Site icon

నేటితో ముంబైలో టీమిండియా క్వారంటైన్‌ పూర్తి…

త్వరలో శ్రీలంక పర్యటనకు బయలుదేరే టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం ముంబయిలోని ఓ స్టార్‌ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్నారు. నేటితో వారికి క్వారంటైన్‌ గడువు ముగుస్తుంది. ఈ ఆటగాళ్లకు బీసీసీఐ సకల సౌకర్యాలు కల్పించింది. వారికెంతో ఇష్టమైన ‘మాక్‌డక్‌’ అనే వెజిటేరియన్‌ రెసిపీని ప్రత్యేకంగా తయారు చేయించింది. అదెలా చేశారనే విషయాన్ని కూడా ఒక వీడియోలో బీసీసీఐ పంచుకుంది. ఈ వీడియోలో ప్రధాన చెఫ్‌ రాకేశ్‌ కాంబ్లే తన సిబ్బందిని పరిచయం చేస్తూ వివరంగా ‘మాక్‌డక్‌’ను ఎలా వండుతారో చూపించారు. అది సంజూ శాంసన్‌కు ఎంతో ఇష్టమని, ధావన్‌ కూడా చాలా బాగుందని చెప్పాడని వెల్లడించారు రాకేశ్‌. ఇక ముంబయికి చెందిన పాండ్య సోదరులు తరచూ దాన్ని తింటారని.. అన్నారు.