భారత జట్టు ఈ నెలలో సౌత్ ఆఫ్రికా పర్యాటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అక్కడ మూడు టెస్టులు. మూడు వన్డేలలో సౌత్ ఆఫ్రికా జట్టుతో టీం ఇండియా పోటీ పడుతుంది. అయితే ఈ పర్యటనలో టెస్ట్ సిరీస్ కోసం కొంత మంది స్టార్ ఆటగాళ్లు గాయాల కారణంగా దూరం అవుతున్నారు అని తెలుస్తుంది. అయితే తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, గిల్ గాయపడిన విషయం తెలిసిందే.
జడేజా, ఇషాంత్ కాన్పూర్ లో జరిగిన మొదటి టెస్ట్ లోనే గాయపడి రెండో టెస్ట్ కు దూరం అయ్యారు. ఇక గిల్ రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ సమయంలో ఫిల్డింగ్ చేస్తూ గాయ పడ్డాడు. దాంతో రెండో ఇన్నింగ్స్ లో అతని స్థానంలో పుజారా ఓపెనర్ గా వచ్చాడు. అయితే ఇప్పుడు ఈ ముగ్గురు ఆటగాళ్లు కోలుకోవడం ఆలస్యం అవుతున్న కారణంగా సౌత్ ఆఫ్రికా పర్యాటనకు ముగ్గురు దూరం కానున్నారు అని తెలుస్తుంది.