Site icon NTV Telugu

టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి చేదు అనుభవం

దేశంలో సైబర్ నేరగాళ్ల వలలో పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలను కూడా సైబర్ నేరగాళ్లు వదిలిపెట్టడం లేదు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, సచిన్ బాల్య మిత్రుడు వినోద్ కాంబ్లీ కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నాడు. డిసెంబర్ 3వ తేదీన కేవైసీ (నో యువర్ కస్టమర్) పేరుతో ఓ వ్యక్తి కాల్ చేసి వినోద్ కాంబ్లీకి కుచ్చుటోపీ పెట్టాడు. ఓ వ్యక్తి తాను బ్యాంకు ఎగ్జిక్యూటివ్ అని చెప్పి… వినోద్ కాంబ్లీకి కాల్ చేసి కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని సూచించాడు.

Read Also: టీమిండియా వన్డే కెప్టెన్ మార్పుపై గంగూలీ క్లారిటీ

అయితే సదరు వ్యక్తి వివరాలు సరిగ్గా కనుక్కోకుండా వినోద్ కాంబ్లీ అతడు పంపిన లింకులను క్లిక్ చేసి వివరాలను పంపించాడు. దీంతో వినోద్ కాంబ్లీ బ్యాంకు ఖాతా నుంచి రూ.1.13 లక్షలు మాయం అయ్యాయి. వరుసగా సదరు వ్యక్తి నుంచి కాల్స్ రావడంతోనే తాను వివరాలను సబ్మిట్ చేశానని… అనంతరం తాను షాపింగ్ చేసినట్లు తన ఖాతా నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయని వినోద్ కాంబ్లీ ముంబైలోని బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాంబ్లీ ఫిర్యాదు మేరకు బాంద్రా సైబర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Exit mobile version