ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా కొనసాగుతుంది. తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ 51 రేటింగ్ పాయింట్లతో ఏకంగా 8 స్థానాలు ఎగబాకి తొలి స్థానానికి చేరుకోగా.. బ్యాటింగ్ విభాగంలో యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ టాప్ ర్యాంక్‌కు చేరువయ్యాడు. ప్రస్తుతం టాప్ ప్లేస్‌లో ఉన్న బాబర్ ఆజమ్‌కు గిల్ మధ్య కేవలం 43 పాయింట్ల తేడా మాత్రమే ఉంది.
Read Also: Dimple Yadav: ఓబీసీ, మైనారిటీ మహిళలు కూడా రిజర్వేషన్ల నుంచి ప్రయోజనం పొందాలి
ఇక, ఎల్లుండి నుంచి ఆసీస్‌తో జరుగబోయే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో శుబ్ మన్ గిల్ ఒక్క కీలక ఇన్నింగ్స్ ఆడినా పాక్ సారథి బాబర్‌ను వెనక్కు నెట్టి తొలి స్థానం దక్కించుకుంటాడు. వన్డే టీమ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఇక్కడ కూడా టీమిండియా హవా నడుస్తుంది. ఆసియా కప్-2023 గెలిచి జోరు మీదున్న టీమిండియా.. పాకిస్తాన్‌తో సమానమైన రేటింగ్ పాయింట్లు కలిగి సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇక, ఆసీస్‌తో జరిగే తొలి వన్డేలో భారత్ గెలిస్తే అగ్రస్థానానికి వెళ్తుంది. తద్వారా టెస్ట్, టీ20, వన్డే ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచిన జట్టుగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పటికే భారత్ టెస్ట్, టీ20 ర్యాంకింగ్స్‌లో భారత జట్టు అగ్రస్థానంలో ఉంది.
Read Also: ODI WC 2023: వరల్డ్ కప్ కు టీమిండియా జెర్సీలో మార్పులు.. హర్షం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్
ఇక, పొట్టి ఫార్మాట్ విషయానికొస్తే.. ఈ ఫార్మాట్‌లో టీమిండియా నెంబర్ వన్ టీమ్ గా కొనసాగుతుంది. టీ20 నంబర్ వన్ బ్యాటర్‌గా సూర్యకుమార్ తన హవాను నడిపిస్తున్నాడు. టీ20 నంబర్-2 ఆల్‌రౌండర్‌గా హార్ధిక్ పాండ్యా కూడా సత్తా చాటాతున్నాడు. ఇక, టెస్ట్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత్ జట్టు గతకొంతకాలంగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. టెస్ట్‌ల్లో చాలాకాలంగా నంబర్ వన్ జట్టుగా టీమిండియానే కొనసాగుతుంది. వ్యక్తిగత ప్రదర్శనల్లోనూ సత్తా చాటుతూ అన్ని విభాగాల్లో అగ్రస్థానాల్లో ఉంది. నంబర్ వన్ టెస్ట్ బౌలర్‌గా అశ్విన్, నంబర్ 3 బౌలర్‌గా జడేజా.. ఆల్‌రౌండర్ల విభాగంలో తొలి రెండు స్థానాల్లో జడేజా, అశ్విన్‌లు ఉన్నారు. ఇలా టీమిండియా, టీమిండియా ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దాదాపుగా అన్ని విభాగాల్లో టాప్ ప్లేస్‌ల్లోనే ఉన్నారు. అతి త్వరలో భారత్ నంబర్ వన్ వన్డే జట్టుగా, గిల్ నంబర్ వన్ వన్డే బ్యాటర్‌గా నిలిచే ఛాన్స్ ఉంది.
