Team India History: నీ యవ్వ తగ్గేదేలే.. టీ20 క్రికెట్లో టీమిండియా సరికొత్త చరిత్ర!
- టీ20 క్రికెట్లో భారత్ ప్రత్యేక స్థానం
- టీ20 సిరీస్‌లలో వరుస విజయాల పరంపర
- స్వదేశంలో వరుస సిరీస్ విజయాల పరంపర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 అంతర్జాతీయ క్రికెట్లో స్థిరత్వం, గెలుపు పరంపర కొనసాగించడం ఏ జట్టుకైనా పెద్ద సవాలే. అయితే భారత జట్టు ఈ విషయంలో ప్రపంచ క్రికెట్లోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. పూర్తి సభ్య దేశాల (FM Teams) మధ్య జరిగిన టీ20 సిరీస్‌లలో వరుస విజయాల పరంగా భారత్ అద్భుత రికార్డులు నమోదు చేస్తోంది. తాజా గణాంకాల ప్రకారం.. భారత్ ప్రస్తుతం 11 వరుస టీ20 అంతర్జాతీయ సిరీస్‌లను గెలుచుకొని అగ్రస్థానంలో నిలిచింది. ఈ పరంపర 2024 నుంచి కొనసాగుతోంది.
దాయాది పాకిస్థాన్ కూడా 2016–2018 మధ్య 11 వరుస సిరీస్ విజయాలు సాధించింది. అయితే ప్రస్తుతం భారత్ విజయ పరంపర కొనసాగుతోంది. టీమిండియా రికార్డు మరింత మెరుగయ్యే అవకాశం ఉంది. 2017–18 మధ్య 7 వరుస సిరీస్‌లు, 2019–21 మధ్య 6 వరుస సిరీస్‌లు గెలుచుకొని టీ20 ఫార్మాట్లో భారత జట్టు తన ఆధిపత్యాన్ని చూపించింది. ఈ గణాంకాలు భారత జట్టు ఎంత కాలంగా టీ20ల్లో స్థిరంగా ప్రదర్శిస్తోందో స్పష్టంగా చెబుతున్నాయి.
Also Read
- Rohit Sharma Future: గిల్ చేతుల్లో రోహిత్ భవితవ్యం.. సెలెక్టర్లు కూడా సైడ్ అవ్వాల్సిందే!
- Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ జోరు.. శ్రీశంకర్‌కు రజతం, దిలీప్ గావిత్‌కు స్వర్ణం..
- Vaibhav Sooryavanshi: అప్పుడే వైభవ్ సూర్యవంశీకి ప్రమోషన్.. వైస్ కెప్టెన్‌గా ఎంపిక..
- Mohammed Shami: రంజీల్లో రికార్డులు కొట్టినా లభించని చోటు.. షమీకి భారీ ఎదురుదెబ్బ..
Also Read: Abhishek Sharma History: ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్.. అంతర్జాతీయ టీ20ల్లో కొత్త రికార్డు ట్రెండ్!
స్వదేశంలో వరుస సిరీస్ విజయాల విషయంలో భారత్ ముందంజలో ఉంది. 2022 నుంచి 2026 వరకు భారత్ స్వదేశంలో 10 వరుస టీ20 సిరీస్‌లను గెలుచుకొని రికార్డు సృష్టించింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా 2006–10 మధ్య 8 వరుస సిరీస్‌లు, భారత్ 2019–22 మధ్య 7 సిరీస్‌లు, పాకిస్థాన్ 2008–18 మధ్య 5 వరుస సిరీస్‌లు గెలుచుకున్నాయి. మొత్తంగా చూస్తే టీ20 అంతర్జాతీయ క్రికెట్లో వరుస సిరీస్ విజయాల పరంగా భారత జట్టు ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తోంది. యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞులు, ఆగ్రసివ్ ఆటతీరు భారత్‌ను పొట్టి ఫార్మాట్లో అజేయ శక్తిగా నిలబెడుతోంది. ఈ విజయ పరంపర ఇంకా ఎంత దూరం సాగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
MLA Jagan: ‘బెంగళూరును ఏలుతున్నాం’ వ్యాఖ్యలపై దుమారం.. ఎమ్మెల్యే జగన్‌పై కన్నడ సంఘాల ఆగ్రహం
-
Sai Pallavi: సహజ నటన, అభినయం.. సీతమ్మ పాత్రలో ఒదిగిపోయిన సాయిపల్లవి!
-
Colorful RimBook L1 Plus: AMD రైజెన్ 7 7735HS ప్రాసెసర్‌తో.. కలర్ ఫుల్ రిమ్బుక్ L1 ప్లస్ ల్యాప్‌టాప్ విడుదల
-
Bihar: భోజనం ఆలస్యమైందని.. వదిన తల నరికి, ఇంటి ముందు వేలాడదీసిన వ్యక్తి..
-
AP Building Rules: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. బిల్డింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. అమల్లోకి కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!