Site icon NTV Telugu

Team India: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రికార్డు

Team India

Team India

Team India: కోల్‌కతా వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో అద్భుత విజయం సాధించిన టీమిండియా వన్డే సిరీస్‌తో పాటు ఓ అరుదైన ఘనతను కూడా సాధించింది. ఈ విజయంతో వన్డే ఫార్మాట్‌లో ఓ ప్రత్యర్థి జట్టుపై అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది. శ్రీలంకపై వన్డేల్లో భారత్‌కు ఇది 95వ విజయం. గతంలో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా సాధించిన 95 వన్డేల విజయ రికార్డును తాజాగా టీమిండియా సమం చేసింది. ఈ జాబితాలో భారత్-ఆస్ట్రేలియా సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. శ్రీలంకపై పాకిస్థాన్ 92 విజయాలను నమోదు చేసింది.

Read Also: Black Cardamom: నల్ల యాలకులు తింటే.. ఈ ఉత్తమ ప్రయోజనాలు సొంతం

మరోవైపు శ్రీలంకపై భారత్‌కు ఇది 26వ ద్వైపాక్షిక సిరీస్ విజయం. అటు కోల్‌కతా వన్డే ఓటమితో శ్రీలంక చెత్త రికార్డును నమోదు చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక ఓటములు చవి చూసిన జట్టుగా శ్రీలంక అప్రతిష్టను మూటగట్టుకుంది. వన్డేల్లో ఇప్పటి వరకు 437 మ్యాచ్‌లు ఓడిన శ్రీలంక.. టీ20ల్లో 94 మ్యాచ్‌లు ఓడిపోయింది. రెండు ఫార్మాట్లలో కలిపి శ్రీలంక అత్యధిక ఓటములు కలిగిన జట్టుగా నిలవడం గమనించాల్సిన విషయం. కాగా వన్డే సిరీస్‌లో నామమాత్రపు మూడో వన్డే ఆదివారం తిరువనంతపురం వేదికగా జరగనుంది.

Exit mobile version