IND Vs BAN: ఇషాన్ డబుల్ సెంచరీ.. కోహ్లీ సెంచరీ.. బంగ్లాదేశ్ ముందు భారీ టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Vs BAN: బంగ్లాదేశ్ పర్యటనలో తొలి రెండు వన్డేల్లో ఓడి సిరీస్ కోల్పోయిన టీమిండియా ఎట్టకేలకు జూలు విదిల్చింది. మూడో వన్డేలో భారీ స్కోరు చేసింది. చిట్టగ్రామ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ఇషాన్ కిషాన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. అతడు కెరీర్లో చేసిన తొలి వన్డే సెంచరీని చిరస్మరణీయం చేసుకున్నాడు. 131 బంతుల్లో 10 సిక్సర్లు, 24 ఫోర్లతో ఇషాన్ కిషన్ చెలరేగి ఆడాడు. అతడికి విరాట్ కోహ్లీ మంచి సహకారం అందించాడు. విరాట్ కోహ్లీ కెరీర్లో 44వ వన్డే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడు 91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 113 పరుగులు చేశాడు. వీళ్లిద్దరూ తప్ప జట్టులో మరెవరూ కనీసం హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయారు.
Read Also: Kollu Ravindra: వైసీపీకి బీసీల దమ్మేంటో త్వరలోనే చూపిస్తాం
Also Read
- Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
- Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్‌గా స్టాట్స్!
- INDW vs AUSW: గ్రూప్-ఏలో ఉత్కంఠభరిత పోటీ.. భారత్ సెమీస్ చేరాలంటే అద్భుతమే జరగాలి!
- Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
ఓపెనర్ శిఖర్ ధావన్ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విఫలం అయ్యాడు. అతడు కేవలం 3 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. అటు ఈ మ్యాచ్‌తో కెప్టెన్‌గా మారిన కేఎల్ రాహుల్ కూడా వైఫల్యాలను కొనసాగిస్తున్నాడు. విధ్వంసకర సెంచరీ బాదిన ఇషాన్ కిషన్‌పై నెటిషన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బంగ్లాదేశ్‌తో తొలి వన్డే నుంచి ఇషాన్ కిషన్‌ను ఆడించినా సరిపోయేదని కామెంట్ చేస్తున్నారు. నిన్ను తక్కువ అంచనా వేసార్రా బుడ్డోడా అంటూ కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలవాలంటే 410 పరుగులు చేయాలి. ఒక దశలో టీమిండియా 450కి పైగా పరుగులు చేస్తుందని అభిమానులు భావించారు. కానీ చివరి 10 ఓవర్లలో బంగ్లాదేశ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో కేవలం 400 పరుగుల మార్కును మాత్రమే టీమిండియా దాటగలిగింది.
తాజావార్తలు
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
-
Donald Trump: ట్రంప్ మైండ్‌లో ఒబామా ‘రెంట్ ఫ్రీ’ సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
-
Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్‌గా స్టాట్స్!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!