IND Vs SA: కేఎల్ రాహుల్ స్థానంలో పంత్.. టీమిండియా కోచ్ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Vs SA: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడి విజయం సాధించింది. టీమిండియా మంచి ప్రదర్శనే చేస్తున్నా ఓపెనర్ రాహుల్ ప్రదర్శన మాత్రం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్థాన్, నెదర్లాండ్స్‌తో భారత్ ఆడిన మ్యాచ్‌లలో కేఎల్ రాహుల్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికాతో ఆదివారం ఆడనున్న మ్యాచ్‌లో అతడి స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్పందించాడు. రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన కేఎల్ రాహుల్ బ్యాటింగ్ సామర్థ్యంపై నమ్మకం పోదని స్పష్టం చేశాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో అతడు బాగా ఆడినట్లు గుర్తుచేశాడు. అందుకే రాహుల్ స్థానంలో ఇంకొకరి గురించి ఆలోచించడం లేదని విక్రమ్ రాథోడ్ వెల్లడించాడు.
Read Also: NZ Vs SL: ఫిలిప్స్ వీరవిహారం.. టీ20 ప్రపంచకప్‌లో రెండో సెంచరీ
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 300 బంతులు ఆడగలనని ప్రపంచానికి చూపించాలి!
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. సచిన్, సెహ్వాగ్ తర్వాత..!
- Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
- Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
కాగా ఆదివారం పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న మ్యాచ్‌లో గెలిచి హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. గత రెండు మ్యాచ్‌లలో ఆడిన జట్టునే ఈ మ్యాచ్‌లోనూ రోహిత్ సేన కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో స్పిన్నర్ చాహల్ మరికొన్ని మ్యాచ్‌ల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టచ్‌లోకి వచ్చిన రోహిత్ తన ఫామ్‌ను కొనసాగించాల్సి ఉంటుంది. అటు విరాట్ కోహ్లీ కూడా తన సూపర్ ఫామ్ కొనసాగిస్తే దక్షిణాఫ్రికా జట్టుకు కష్టాలు తప్పకపోవచ్చు. మరోవైపు వర్షం కారణంగా జింబాబ్వేతో గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకున్న సఫారీ టీమ్.. గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. ఈ క్రమంలోనే భారత్‌పై ఎలాగైనా గెలిచి సెమీస్ రేసులో నిలవాలనే పట్టుదలతో ఉంది.
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!