Site icon NTV Telugu

IND vs ENG: ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో భారత్ ఆలౌట్.. స్కోర్ ఎంతంటే..?

Ind

Ind

IND vs ENG: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా లీడ్స్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత ఆలౌటైంది. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 471 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక, 359/3తో రెండో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా.. 112 రన్స్ జత చేసిన తర్వాత మిగతా 7 వికెట్లను చేజార్చుకుంది. 127 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో బరిలోకి దిగిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (147; 227 బంతుల్లో) దగ్గర బెన్ స్టోక్స్ బౌలింగ్ లో జెమ్మి స్మిత్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 65 పరుగుల ఓవర్‌ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన వైస్ కెప్టెన్ రిషభ్‌ పంత్ (134; 178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీతో రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు.

Read Also: Allu Arjun: అల్లు అర్జున్ ‘శక్తిమాన్’పై పెదవి విప్పిన డైరెక్టర్!

అయితే, తొలి రోజే యశస్వి జైస్వాల్ (101; 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కెప్టెన్ శుభ్ మన్ గిల్, పంత్ కూడా అద్భుతమైన శతకాలు చేయడంతో భారత్ స్కోర్ 471కి చేరుకుంది. మరోవైపు, ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్‌ స్టోక్స్ 4, జోష్ టంగ్ 4, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలో వికెట్ తీసుకున్నారు.

Exit mobile version