Site icon NTV Telugu

Rohit Sharma: టీమ్‌ కల్చర్ ముఖ్యం బిగులు.. రోహిత్‌ను తప్పించిందే దాని కోసం..

Bcci

Bcci

Rohit Sharma: టీమిండియా వన్డే క్రికెట్ కెప్టెన్సీ నుంచి రోహిత్‌ శర్మను బీసీసీఐ తప్పించింది. భవిష్యత్తును దృష్టి పెట్టుకుని యంగ్ ప్లేయర్ శుభ్‌మన్‌ గిల్‌ను బాధ్యతలు అప్పగించింది. అయితే, దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వచ్చే వన్డే ప్రపంచకప్‌ వరకూ కొత్త కెప్టెన్ తోనే టీమిండియా బరిలోకి దిగాలనే ఆలోచనతో ఉన్నట్లు టీమ్ మేనేజ్‌మెంట్ పేర్కొంది. అందుకే రోహిత్ స్థానంలో గిల్ కు అవకాశం కల్పించినట్లు తెలిపింది. రాబోయే రోజుల్లో గిల్‌కే 3 జట్ల పగ్గాలను అందించేందుకు ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే, టెస్టుల్లో సారథి వ్యవహరిస్తుండగా.. టీ20ల్లోనూ సూర్య కుమార్‌ యాదవ్‌కు డిప్యూటీగా బీసీసీఐ ఎంపిక చేసింది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత ఎలాగూ గిల్‌కే కెప్టెన్సీ వచ్చే అవకాశం ఉంది.

Read Also: Telangana Govt: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట..

అయితే ఆటగాడిగా రోహిత్ శర్మ వేరు. నాయకుడిగా పోషించే రోల్ వేరు.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో తనదైన ఫిలాసఫీతో జట్టును ముందుండి నడిపిస్తాడు. ఇప్పుడు అతడు కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నాడు. అవి చాలా తక్కువగా జరిగే మ్యాచులు అని చెప్పాలి. దీంతో టీమ్‌ కల్చర్ డిస్టర్బ్‌ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి, అన్ని ఫార్మాట్లకు ఒకరే సారథిగా ఉంటే డ్రెస్సింగ్‌ రూమ్‌లో మంచి వాతావరణం ఉండే ఛాన్స్ ఉంది. గంభీర్ ప్రధాన కోచ్‌గా వచ్చిన తర్వాత ఆరు నెలల వరకూ జట్టు వెనక నుంచి నడిపించేవాడు. అయితే, న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌, ఆస్ట్రేలియాలో ఓటమి తర్వాత గంభీర్‌ తనదైన వ్యూహాలకు పదును పెట్టాడు. అప్పటి వరకూ టెస్టులు, వన్డేల్లో రోహిత్‌కే ఎక్కువ ఛాన్స్ ఇచ్చిన గౌతమ్.. జట్టును తన అధీనంలోకి తీసుకున్నాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇక, విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఇప్పటికే 35 ఏళ్లకు పైబడి ఉన్నారు.. వన్డే ప్రపంచకప్‌ కు ఇంకో రెండేళ్ల సమయం ఉంది. ఆలోపు వారిద్దరు ఫామ్‌లోనూ ఉండటం కోసమే గంభీర్ – అజిత్ అగార్కర్ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కసారిగా రోహిత్ ఫామ్‌తో ఇబ్బంది పడితే అప్పుడు జట్టులో అయోమయ పరిస్థితులు రాకూడదని ఇలా చేశారని బీసీసీఐ ప్రతినిధి ఒకరు చెప్పుకొచ్చారు.

Exit mobile version