NTV Telugu Site icon

Virat Kohli: జస్ప్రీత్ బుమ్రా పిటిషన్‌పై నేను సంతకం చేస్తా: కోహ్లీ

Virat Kohli Speech

Virat Kohli Speech

Virat Kohli Heap Praise on Jasprit Bumrah in T20 World Cup 2024 Performance: టీ20 ప్రపంచకప్‌ 2024ను భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. టీమిండియా విజేతగా నిలవడంతో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాది కీలక పాత్ర. వికెట్స్ అవసరం అయినప్పుడు ఆపద్బాంధవుడిలా జట్టును ఆదుకున్నాడు. తన అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన బుమ్రా.. అత్యుత్తమ ఎకానమీతో బంతులేశాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో వికెట్లు తీసి జట్టును గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రపంచకప్‌లో ఆడిన 8 మ్యాచ్‌లలో 15 వికెట్స్ పడగొట్టాడు. 29.4 ఓవర్లలో కేవలం 12 బౌండరీలు, రెండు సిక్సర్లు మాత్రమే ఇచ్చాడు.

Also Read: Rohit Shama: టీ20 ప్రపంచకప్ ట్రోఫీ యావత్ దేశానిది.. రోహిత్ ఎమోషనల్ స్పీచ్!

టీ20 ప్రపంచకప్‌ 2024లో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. బుమ్రాను స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఆకాశానికి ఎత్తేశాడు. బుమ్రాను జాతి సంపదగా గుర్తించాలని కోహ్లీ అన్నాడు. వాంఖడే మైదానంలో క్రికెటర్ల సన్మాన కార్యక్రమంలో బుమ్రా గురించి కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ ఉత్కంఠంగా సాగింది. ఓ దశలో మరోసారి కప్‌ చేజారిపోతుందా? అని అనుకున్నా. చివరి 5 ఓవర్లలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. బుమ్రా వేసిన ఆ రెండు ఓవర్లు అద్భుతం. ప్రతిస మ్యాచ్‌లో జట్టును విజయం వైపు నడిపించిన బుమ్రాపై వెల్లువెత్తిన ప్రశంసలు చాలా ఆనందం కలిగించాయి. ఎన్నాళ్లు భారత జట్టు తరఫున ఆడాలనుకునేది అతడి ఇష్టం. బుమ్రాను ఎనిమిదో వింతగా ప్రకటించాలనే పిటిషన్‌పై నేను సంతకం చేస్తా. తరానికి ఒక్కడు మాత్రమే ఇలాంటి బౌలర్‌ ఉంటాడు’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.