T20 World Cup: నేటి నుంచి టీ20 వరల్డ్ కప్ స్టార్ట్.. స్పెషల్ అట్రాక్షన్ గా ఆ మాజీ కెప్టెన్!
- నేటి నుంచి స్టార్ట్ కానున్న టీ20 వరల్డ్ కప్..
- వాంఖడే స్టేడియంలో ప్రపంచకప్ ప్రారంభోత్సవ వేడుకలు..
- ఈ ప్రారంభోత్సవంలో స్పెషల్ అట్రాక్షన్ గా భారత్ మాజీ కెప్టెన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: 2026 టీ20 ప్రపంచ కప్ నేటి (ఫిబ్రవరి 7న) నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ తొలి మ్యాచ్ నెదర్లాండ్స్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య శ్రీలంకలో జరగనుంది. అలాగే, భారత్ లో స్కాట్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య మరో మ్యాచ్ జరగనుంది. అలాగే, భారత జట్టు కూడా టోర్నమెంట్ తొలి రోజు నుంచి బరిలోకి దిగనుంది. యూఎస్ఏతో తన తొలి మ్యాచ్ ఆడేందుకు సూర్య కుమార్ యాదవ్ సేన రెడీ అయింది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు గ్రాండ్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. భారత్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ మధ్య మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగ్గా.. అక్కడే టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభోత్సవ వేడుకలు కొనసాగనున్నాయి. కాగా, ఈ వేడుకలు సాయంత్రం 6:00 గంటలకు స్టార్ట్ కానున్నాయి. ఆ తరువాత ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరించనుంది. రిషబ్ శర్మ, శివమణిల మ్యూజిక్ తో ఈ కార్యక్రమం ఆరంభం కానుంది. అనంతరం ప్రపంచ కప్ ట్రోఫీ 2026ని స్టేడియంలోకి తీసుకొస్తారు. ఈ ట్రోఫీ వేడుకలో ఓ స్పెషల్ అట్రాక్షన్ గా రోహిత్ శర్మ నిలవనున్నారు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
అయితే, టోర్నీ ట్రోఫీని ఐసీసీ చైర్మన్ జై షా, భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకొస్తారు. రోహిత్ కెప్టెన్సీలో భారత్ 2024 ఎడిషన్‌లో టైటిల్‌ను సాధించిన సంగతి తెలిసిందే. దీనిని కాపాడుకునే బాధ్యత సూర్య కుమార్ యాదవ్‌పై ప్రస్తుతం ఉంది. రోహిత్ తో పాటు ఆయా దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 20 మంది పిల్లలతో కలిసి 2026 టీ20 వరల్డ్ కప్ ప్రారంభోత్సవాన్ని అధికారికంగా స్టార్ట్ చేయనున్నారు. ట్రోఫీ ఆవిష్కరణ తర్వాత ఫ్యాన్స్ జోష్ మరింత రెట్టింపు చేసేందుకు ఐసీసీ, బీసీసీఐ భారీగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అద్భుతమైన పాటలతో పాటు డ్యాన్స్ ప్రోగ్రాం కూడా చేపట్టారు. ఇందులో స్టార్ బాద్షా ప్రదర్శన, నోరా ఫతేహితో పాటు అనేక మంది డ్యాన్సర్లు ప్రదర్శన చేయనున్నారు. చివర్లో బాణసంచా పేల్చిన తర్వాత.. ఆపై సాయంత్రం 7 గంటలకు టీమిండియా వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ స్టార్ట్ కానుంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!