NTV Telugu Site icon

T20 World Cup 2024 Final : తుది సమరానికి వేళాయె.. నేడే సఫారీలతో సమరం..

T20 World Cup Final 2024

T20 World Cup Final 2024

T20 World Cup 2024 Final : 7 నెలల క్రితం అద్భుత ప్రదర్శనతో వన్డే ప్రపంచం ఫైనల్ వరకు చేరుకొని చివరి ఘట్టంలో ఓడిపోయి కోట్ల మంది ఆశలను అడియాస చేసింది టీమిండియా. అయితే అప్పుడు చేజారిన అవకాశాన్ని మరోసారి వడిసి పట్టుకొనే అవకాశం నేడు ఆసన్నమైంది. టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో నేడు టీమిండియా దక్షిణాఫ్రికాతో తెలపడనుంది. 17 ఏళ్ల క్రితం అప్పటి టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మొదలుపెట్టిన ఈ వేట.. ఇన్నాళ్లకు మరోసారి రోహిత్ అందుకునే ఛాన్స్ వచ్చింది. ఇప్పటివరకు సీరియస్ లో అపజయం ఎరగకుండా ఫైనల్ కు వచ్చింది టీమిండియా. ఈ ఒక్కరోజు రోహిత్ సేన వెంట అదృష్టం తోడైతే అందుకు తగ్గ ప్రదర్శన టీమిండియా కనపడితే మరోసారి ప్రపంచకప్ పై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది.

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

బ్రిడ్జ్ టౌన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తుది పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ విజయంతో దక్షిణాఫ్రికా మొదటిసారి ప్రపంచకప్ ను గెలుచుకుంటుందో లేకపోతే టీమిండియా రెండోసారి టి20 ప్రపంచ కప్పును గెలుచుకుంటుందా..? అనేది రాత్రి 8 గంటలకు మొదలయ్యే మ్యాచ్ తో తేలిపోతుంది. ఇకపోతే ఐపిఎల్ 17వ సీజన్లో అత్యధిక స్కోరు సాధించిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ లో పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో నిలిచే కోహ్లీ ఆశ్చర్యకరంగా ఈ సీజన్ లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. ఒక బంగ్లాదేశ్ పై చేసిన 37 పరుగులను మినహాయిస్తే అన్ని మ్యాచ్ లలోను విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. ఇక తన స్థాయి ఆటను ఫైనల్లో చూపితేనే టీమిండియాకు మరోసారి వరల్డ్ కప్ అందనుంది. ఇక మిగతా టీం విషయానికి వస్తే సమిష్టి ప్రదర్శనలతో టీమిండియా ఫైనల్ కు చేరుకుంది. ముఖ్యంగా బౌలింగ్ యూనిట్లో మంచి ప్రదర్శన చేయడం వల్ల టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగించింది. ముఖ్యంగా బూమ్ర ప్రతి మ్యాచ్ లోను పొదుపుగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా కీలక వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టుకు కళ్లెం వేయగలిగారు. ముఖ్యంగా పాకిస్తాన్ పై 120 పరుగుల లక్ష్యాన్ని కూడా కట్టడి చేశారంటే దానికి కారణం బూమ్రానే. బూమ్రాతో పాటు మరో బౌలర్ హర్ష దీప్ కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తూ.. ప్రస్తుతం అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా సీరిస్ లో కొనసాగుతున్నాడు. ఇక స్పిన్నర్ల విషయానికొస్తే.. కుల్ దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా వారికి తగ్గ బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అనుకున్న దానికంటే ఎక్కువగా ఆడుతున్నాడు. నేడు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో తుది జట్లను ఈ విధంగా అంచనా వేయవచ్చు.

PM Modi: జూలై 8న ప్రధాని మోడీ రష్యా పర్యటన.. భారీ ఏర్పాట్లు చేస్తున్న క్రెమ్లిన్..

భారత్‌లో రోహిత్‌ (కెప్టెన్‌), కోహ్లి, పంత్, సూర్యకుమార్, దూబె, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్‌దీప్, అర్ష్‌దీప్, బుమ్రా లను అంచనా వేయగా.. మరోవైపు.,

దక్షిణాఫ్రికాలో డికాక్, రీజా హెండ్రిక్స్, మార్‌క్రమ్, క్లాసెన్, మిల్లర్, స్టబ్స్, యాన్సెన్, కేశవ్‌ మహరాజ్, రబాడ, నోకియా, షంసి లను అంచనా వేయవచ్చు.