T20 World Cup 2026: రన్ రేట్ లైట్..! టీమిండియా సెమీస్‌కు చేరే ఒకే ఒక మార్గం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు సౌతాఫ్రికా షాక్ ఇచ్చింది.. దీంతో, లెక్కలు మారిపోయాయి.. వరల్డ్‌కప్‌లో టీమ్ ఇండియా ప్రయాణం ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. సూపర్-8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం భారత సెమీస్ అవకాశాలను క్లిష్టతరం చేసింది. ప్రస్తుతం భారత్ నెట్ రన్ రేట్ (NRR) -3.00 కంటే తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.
* వెస్టిండీస్ దెబ్బ.. రన్ రేట్ కష్టాలు!
ఒకవైపు భారత్ భారీ ఓటమితో కుదేలైతే, మరోవైపు వెస్టిండీస్ జట్టు జింబాబ్వేపై 107 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసి తన రన్ రేట్‌ను +5.00 దాటించింది. దీనివల్ల రన్ రేట్ పరంగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలను భారత్ అధిగమించడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
* భారత్ ముందున్న ఏకైక మార్గం (1):
నెట్ రన్ రేట్ గందరగోళం లేకుండా భారత్ సెమీస్‌కు వెళ్లాలంటే ఇలా జరగాలి..
– భారత్ తన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో (జింబాబ్వే మరియు వెస్టిండీస్) తప్పనిసరిగా భారీ తేడాతో గెలవాలి.. అదే సమయంలో, దక్షిణాఫ్రికా జట్టు వెస్టిండీస్‌ను ఓడించాలి.
– ఒకవేళ దక్షిణాఫ్రికా తన మిగిలిన మ్యాచ్‌ల్లో గెలిస్తే అది 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటుంది. అప్పుడు భారత్ తన రెండు మ్యాచ్‌లు గెలిచి 4 పాయింట్లతో రెండో స్థానంలో సెమీస్‌కు చేరుకుంటుంది.
* మరో క్లిష్టమైన మార్గం (2)
ఒకవేళ వెస్టిండీస్ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించినట్లయితే.. జింబాబ్వే జట్టు దక్షిణాఫ్రికాను ఓడించాలని మనం కోరుకోవాలి. అప్పుడు దక్షిణాఫ్రికా 2 పాయింట్లతో ఆగిపోతుంది. భారత్ తన రెండు మ్యాచ్‌లు గెలిస్తే 4 పాయింట్లతో వెస్టిండీస్‌తో కలిసి సెమీస్‌కు వెళ్తుంది.
రేపే నిర్ణయాత్మక మ్యాచ్..
గురువారం జరగబోయే మ్యాచ్‌లు సెమీఫైనల్ రేసును ఖరారు చేయనున్నాయి. దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్ మ్యాచ్ ఫలితం మొదట వస్తుంది. ఆ తర్వాతే భారత్ vs జింబాబ్వే మ్యాచ్ జరుగుతుంది. అంటే భారత్ మైదానంలోకి దిగే సమయానికి తాము సెమీస్ రేసులో ఉండాలంటే ఎంత తేడాతో గెలవాలి.. లేదా ఏ సమీకరణం పని చేస్తుందనే దానిపై పూర్తి స్పష్టత వస్తుంది. మొత్తంగా ప్రస్తుతానికి రన్ రేట్ గురించి ఆలోచించడం కంటే, జింబాబ్వే మరియు వెస్టిండీస్‌లపై భారీ విజయాలు నమోదు చేయడమే టీమ్ ఇండియా ముందున్న ఏకైక లక్ష్యం.
తాజావార్తలు
-
Ananya Panday: లైగర్ బ్యూటీకి కష్టకాలం.. రెండేళ్ల ప్రేమకు గుడ్‌బై!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
-
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!