USA vs SA: నేటి నుంచే సూపర్-8 మొదలు.. దక్షిణాఫ్రికాతో అమెరికా ఢీ!
- నేటి నుంచే సూపర్-8
- దక్షిణాఫ్రికాతో అమెరికా ఢీ
- స్టార్ స్పోర్ట్స్-డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
United States vs South Africa Super 8 Prediction: టీ20 ప్రపంచకప్ 2024లో సూపర్-8 సమరానికి సమయం ఆసన్నమైంది. బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో అమెరికాతో దక్షిణాఫ్రికా తలపడనుంది. ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. గ్రూప్ దశలో సత్తాచాటిన పసికూన అమెరికా అదే ఫామ్ కంటిన్యూ చేయాలని చూస్తోంది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన దక్షిణాఫ్రికా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
మెగా టోర్నీలో ఇప్పటివరకు దక్షిణాఫ్రికా అజేయంగా ఉన్నప్పటికీ.. బ్యాటర్ల ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. డికాక్, క్లాసెన్, స్టబ్స్, మిల్లర్ లాంటి హిట్టర్లున్నప్పటికీ.. గ్రూప్ దశలో దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా 120 దాటలేకపోయింది. చివరి మ్యాచ్‌లో పసికూన నేపాల్‌పై ఒక్క పరుగు తేడాతో గట్టెక్కింది. గ్రూప్-2లో ఇంగ్లండ్, వెస్టిండీస్ లాంటి పటిష్ట జట్లతో తలపడాల్సి ఉండడంతో బ్యాటింగ్‌లో పుంజుకోవాలని దక్షిణాఫ్రికా ఆశిస్తోంది. ఇక బౌలింగ్ విభాగంలో అన్రిచ్ నోకియా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. నోకియా సహా బార్ట్‌మన్, రబాడ, యాన్సెన్‌లను ఎదుర్కోవడం అమెరికాకు పెద్ద సవాలే.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
Also Read: Heavy rainfall warning: తెలుగు రాష్ట్రాలతో సహా 19 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
గ్రూప్ దశలో అమెరికా అద్భుతంగా ఆడింది. పాకిస్థాన్ వంటి మేటి జట్టును మట్టికరిపించిన అమెరికా.. టీమిండియాను కూడా ఓ దశలో వణికించింది. దాంతో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో సూపర్-8లో బరిలోకి దిగుతోంది. దక్షిణాఫ్రికాకు అమెరికా గట్టి సవాలు విసురుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాటర్లు ఆరోన్ జోన్స్, గౌస్ రాణిస్తున్నారు. బౌలర్లు హర్మీత్ సింగ్, కెంజిగె, నేత్రావల్కర్‌లు అమెరికాకు కీలకం.
తాజావార్తలు
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
Lava Virat Curve 5G: లావా Virat Curve 5G వచ్చేసింది.. 50MP కెమెరా, Dimensity 7100, 6000mAh బ్యాటరీ
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
-
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
ట్రెండింగ్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!